– ఉస్మానియా మార్చురీ వద్ద కుటుంబీకులకు పరామర్శ
– సిరిసిల్లకు తరలిన ఆరుగురి భౌతిక కాయాలు
– సిరిసిల్లకు తరలిన ఆరుగురి భౌతిక కాయాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : సిరిసిల్లలో తీవ్ర విషాదాన్ని నింపిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం పరామర్శించారు. శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన ఆరుగురు వ్యక్తులు మృతిచెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి చేరుకున్న ఆయన మృతదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో కేటీఆర్ మాట్లాడారు. ఆత్మీయులను కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న వారిని ఆయన ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తాను వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఇలా అకాల మరణం చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. పోస్టుమార్టం, ఇతర అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఆరుగురి మృతదేహాలను అంబులెన్స్‌లలో వారి స్వగ్రామమైన సిరిసిల్లకు తరలించారు. మృతదేహాలను తరలించే వరకు కేటీఆర్ అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ విషాద ఘటనతో అటు సిరిసిల్ల నియోజకవర్గంలోనూ, ఇటు ఉస్మానియా హాస్పిటల్ ప్రాంగణంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




