- ఖేలో ఇండియా సంవాద్
– క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూదిల్లీ, ఆగస్ట్ 27 : దేశ యువత, క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ అథ్లెట్స్‌తో ప్రధాని మోదీ వర్చువల్‌గా సంభాషించారు. అనంతరం యువతను ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడలంటే కేవలం మెడల్స్ కాదని.. యువతలో ఉన్న చైతన్యాన్ని మేల్కొలిపే సాధనాలనీ మోదీ చెప్పుకొచ్చారు. ఆటలు యువశక్తిని వెలికితీస్తాయన్నారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి యువశక్తితో పాటు క్రీడాశక్తి కూడా ఎంతో అవసరమని మోదీ పేర్కొన్నారు. భారత్ ఒలింపిక్స్‌లో తగిన ప్రాతినిథ్యం వహించట్లేదని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. దేశం క్రీడలపై ఎక్కువగా ఆసక్తి చూపడంలేదన్నారు. 2012లో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత్.. 12 ఆటల్లో మాత్రమే మెడల్స్ సాధించిందని తెలిపారు. సర్ఫింగ్ వంటి ఆటల్లో మన క్రీడాకారులు ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. దేశంలో ప్రతిభకు లోటు లేదని, మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందని తెలిపారు. ముఖ్యంగా 5 నుంచి 15 ఏళ్ల వారిలో టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్ చెప్పుకోదగ్గ స్థాయిలో పథకాలను సాధించాలని ఆయన కోరారు. ఇందుకోసం ప్రభుత్వం.. క్రీడాకారులు, అలథెట్లకు సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధాని హామి ఇచ్చారు. డిసెంబర్‌లో జరిగే ’ఖేలో ఇండియా యూత్ గేమ్స్’కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ పోటీలను నిర్వహించనున్నారు.
క్రీడల ప్రోత్సాహానికి ప్రధాని శ్రీకారం :కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : ప్రధాని మోడీ నాయకత్వంలో క్రీడలను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా ఉంది. గతంలో క్రీడల పట్ల నిర్లక్ష్యం ఉండేదని, రాజకీయ జోక్యం వల్ల ప్రతిభ ఉన్న నిజమైన క్రీడాకారులకు తగిన అవకాశాలు దక్కేవవి కాదని కేంద్ర బొగ్గు, గనుల శాU మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఓయూ క్యాంపస్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో గురువారం జరిగిన ఖేలో ఇండియా డైలాగ్-ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 1500 విద్యా సంస్థల విద్యార్థులు, యువ క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆన్‌లైన్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దాదాపు పదిలక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక యువత, విద్యార్థుల జనాభా ఉన్నప్పటికీ గతంలో క్రీడలను విస్మరించారు. కానీ నేడు పరిస్థితి మారుతూ ఉంది.. కిందిస్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రధాని శ్రీకారం చుట్టడంతో అంతర్జాతీయ పోటీల్లో మన దేశం ఎక్కువ పతకాలు సాధిస్తోంద’ని తెలిపారు. అంతర్జాతీయ పోటీలకు వెళ్లే ప్రతీ క్రీడాకారుడిని ప్రధాని మోదీ స్వయంగా కలుస్తారని, ఎవరైనా గెలిస్తే తల్లిదండ్రులు లేదా కోచ్‌ల కంటే ముందే స్వయంగా ఫోన్ చేసి అభినందిస్తారని చెప్పారు. ఒకవేళ ఓడిపోయినా సరే క్రీడాకారులు నిరుత్సాహపడకుండా వారికి ధైర్యం చెబుతూ అండగా నిలుస్తున్నారన్నారు. క్రీడాకారులకు కావలసిన పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు, వారికి నచ్చిన దేశంలో, నచ్చిన కోచ్‌లతో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తోందని చెప్పారు. దేశంలోని యువ జనాభా ప్రాతిపదికన క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించాలన్నదే ప్రధాని లక్ష్యమన్నారు. భారత దేశం 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోందని, అలాగే 2036 ఒలింపిక్స్ మన దేశంలో జరిగేలా విదేశాలతో చర్చలు జరుపుతూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని కూడా కిషన్‌రెడ్డి చెప్పారు. అప్పటికల్లా ప్రపంచ దేశాలతో సమానంగా క్రీడా రంగంలో భారత్ ముందుండాలనేది మన ప్రయత్నమని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల అధినేతలు అందరూ చదువుతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని సూచించారు. అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే రానున్న రోజుల్లో ప్రపంచ క్రీడా చిత్రపటంలో భారతదేశం అగ్రస్థానానికి చేరుకోవడం తథ్యం అని మంత్రి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





