– రెపో రేటు మార్చలేదు
– ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
ముంబై, జూన్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈమేరకు ద్రవ్య పరపతి విధాన సవిÖక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ సవరించకపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇంతకుముందు ఫిబ్రవరి, ఏప్రిల్‌ల్లో జరిగిన ద్రవ్య పరపతి సమీక్షల్లో వడ్డీ రేట్లను మార్చలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత, పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో దేశీయ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. గతేడాది మాత్రం వీటిని పలుమార్లు సవరించింది. ‘సవాళ్ల నడుమ ప్రపంచ ఆర్థికవ్యవస్థ అనిశ్చితిలో కొనసాగుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఎదురయ్యే ఆటుపోట్లను తక్కువ నష్టంతో తట్టుకోగలమని విశ్వాసంతో ఉన్నాం.. ఇంధన ధరలు అధికంగా ఉండటంతో వృద్ధి నెమ్మదించింది.. ద్రవ్యోల్బణం పెరుగుతోంది.. దీనికితోడు ఈ ఏడాది వర్షపాతం సాధారణం కన్నా తక్కువ ఉండటం కూడా ప్రభావం చూపించనుంది.. ఆహార నిల్వలు సరిపడా ఉండటం ఊరటనిచ్చే అంశం.. అంతర్జాతీయంగా బలహీన డిమాండ్, రవాణా ఖర్చులు పెరగడం వంటివి ఎగుమతులకు సవాల్‌గా మారాయి.. అయితే దేశీయ ఆర్థిక కార్యకలాపాలు మాత్రం చాలావరకు స్థిరంగా ఉన్నాయి.. 2026`27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 6.9శాతం నుంచి 6.6శాతానికి తగ్గిస్తున్నాం.. రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను కూడా 4.6 శాతం నుంచి 5.1శాతానికి పెంచుతున్నాం.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లకు నిబంధనలను సరళీకరించాం.. ఈక్విటీ మార్కెట్‌లో ఎనఆరఐలు, ఓవర్సీస్ సిటిజన్స్ పెట్టుబడుల పరిమితిని పెంచాం.. అని గవర్నర్ మల్హోత్రా తెలిపారు. ఎక్స్ఛేంజ్ రేట్‌పై ఆర్‌బీఐ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని, మన దేశీయ కరెన్సీ రూపాయికి నిర్దిష్టమైన రేటును నిర్ణయించాలనుకోవడం లేదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





