– పరిరక్షణ బాధ్యత అందరిదీ అని గుర్తించాలి
– కృష్ణకాంత్ పార్కులో మొక్కలు నాటిన మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో నాకు సంబంధం లేదని ఎవరూ అనుకోవద్దని బీసీ సంక్షేమ, రవాణా శాఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అశోక చక్రవర్తి ఆనాడు మొక్కలు నాటారని.. ఈరోజు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటామని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కృష్ణకాంత్ పార్కులో మంత్రి పొన్నం మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన`ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 12 రోజులపాటు అటవీ శాఖ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. దిల్లీ కాలుష్యపు కోరల్లో చిక్కుకుందని, హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితి రావద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. విద్యుత్ వాహనాల వాడకంతో కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడొచ్చన్నారు. భవిష్యత్తులో వర్షాలు పడని పరిస్థితి ఏర్పడుతుందని, అందరూ నీటిని ఆదా చేయాలని సూచించారు. బోర్లు వేస్తే నీరు వచ్చే పరిస్థితులు లేవన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఇంట్లో మొక్కలు నాటుకోవాలని, ప్లా²స్టిక్‌ను నియంత్రించాలని కోరారు. భూమిలో కలిసిపోయే వస్తువులను వాడితే మంచిదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా, జీహెచఎంసీ కమిషనర్ కర్ణన్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





