Take a fresh look at your lifestyle.

kcr speech

శ్రీనగర్‌, ఆగస్ట్ 16 : ‌జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పహల్గామ్‌లోని ఫ్రిస్లాన్‌ ‌చందన్వారి రోడ్డు ప్రాంతంలో భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది. బస్సు బ్రేకులు ఫెయిలవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏడుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. చాలా మంది సైనికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని అధికారులు ఆసుపత్రికి తరలిస్తున్నారు.

’మంగళవారం ఉదయం 39 మంది ఐటీబీపీ జవాన్లతో ప్రయాణిస్తున్న బస్సు.. బ్రేక్‌లు ఫెయిల్‌ ‌కావడంవల్ల పక్కన ఉన్న నదిలో పడిపోయింది. ఘటనాస్థలికి అధికారులు చేరుకున్నారు. అపార ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే బస్సులోని జవాన్లంతా అమర్‌నాథ్‌ ‌యాత్రకు సంబంధించిన విధులు నిర్వర్తించి తిరిగి వస్తున్నారని ఐటీబీపీ అధికారులు తెలిపారు.

Leave a Reply