పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తాం

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 

రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: రఘునాథపాలెం మండల ప్రజల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రఘునాథ పాలెం మండలం పుఠానితాండ గ్రామం లో పుఠానితాండ జెడ్ పీ రోడ్డు నుండి రేపల్లెవాడ తండా వరకు రూ.330.92 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఎల్నినో దృష్ట్యా తీవ్ర వాతావరణ పరిస్థితులు, వర్షాభావం, అల్ప వర్షపాతం వుందని, రైతులు సాంప్రదాయ పంటల కంటే తక్కు వ కాలపరిమితి కలిగిన పంటలు సాగుచే యాలన్నారు. ఆయిల్ పామ్, మిర్చి, కూర గాయల సాగు తో లాభాలొస్తాయన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఎక రాకు రూ. 50,000 వరకు ప్రోత్సాహకం, అంతరపంటగా కూరగాయలు వేస్తే అద నంగా రూ. 2,000తో పాటు ఉచితంగా
డ్రిప్ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా 40 ఏళ్ల వరకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని మం త్రి వివరించారు. మంచుకొండ ద్వారా నీటి విడుదల కు చర్యలు చేపట్టినట్లు మం త్రి తెలిపారు. బొగ్గువాగు ప్రాజెక్టు ద్వారా దాదాపు రూ.100కోట్లతో పైడ్లైన్ల ద్వారా చెరువులను నింపే కార్యక్రమాన్ని త్వరలో నే ప్రారంభించనున్నట్లు అన్నారు. చెరువు లు నిండటం వల్ల భూగర్భ జలాలు పెరిగి, రైతుల బోర్లకు నిరంతర నీటి సరఫరా అందుతుందని మంత్రి తెలిపారు. పోడు భూములకు పట్టాలు పొందిన రైతులకు బోర్లు, విద్యుత్ కనెక్షన్లు, సోలార్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 10న సమస్య ఉన్నవారు
దరఖాస్తు చేయాలన్నారు. ఆర్వోఎస్ఆర్ పట్టా కలిగిన భూమి యజమానులకు బోర్ వెల్ తవ్వుకోవడానికి అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. కార్యాల యాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా బోర్ వెల్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న రోజే పరిశీలించి అనుమ తులు ఇచ్చేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10 న మండల కార్యాలయంలో ప్రత్యేకంగా దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలె క్టర్ కోరారు. ఐటీడీఏ పీవో బి. రాహుల్, జిల్లా అట వీ అధికారి అనూప్ అగర్వాల్, సుడా చైర్మ న్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, డీసీవో గంగాధర్, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసా చారి, ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, ఇర్రిగే షన్ ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, ఖమ్మం ఆర్డీవో ఎన్.శ్రీనివాస్, పిఆర్ ఈఈ మహేష్ బాబు, రఘునాథపాలెం మండల ఎంపీడీవో అశోక్ కుమార్, తహసీల్దార్ శ్వేత, గ్రామ సర్పంచ్ మూడ్ చిన్న పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *