సోషల్ మీడియాలో ఇందిరమ్మ ఇండ్ల హవా

– హోం టూర్ వీడియోల హల్ చల్
– ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం
– ‘ఎక్స్’ వేదికగా మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన రోజు నుంచి గృహ ప్రవేశం వరకు తమ ఆనందా న్ని, అనుభవాలను అనేక మంది లబ్దిదారులు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకోవడం ఎం తో సంతోషంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. తొలిదశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, రెండో దశలో 2.5 లక్షల ఇండ్లు.. మూడో దశ, నాలుగో దశ, ఐదో దశ.. ఇలా ప్రతి పేదవాడి సొంతింటి కలను ఇందిరమ్మ ఇండ్ల రూపంలో సాకారం చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదల చిరునవ్వులే మా ప్రభుత్వానికి గొప్ప పురస్కారాలని పేర్కొ న్నారు.
గతంలో లాగా మభ్య పెట్టే కార్యక్ర మంగా కాక పేదలకు ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని, అందుకు వీడియోలే సాక్ష్యమని మంత్రి తెలిపారు.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *