– ఏటీఎంలా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్
– రేవంత్ రాహువు, కేసీఆర్ కేతువు అంటూ బండి విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో బీఆరఎస్‌కు, ఇప్ప్పుడు కాంగ్రెస్‌కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విÖడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రాహువు, కేసీఆర్ కేతువు అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిపై అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని నిలదీశారు. కేసీఆర్, రేవంత్‌ల భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కేంద్రానికి రేవంత్‌రెడ్డి రాసిన లేఖలో ఏముందని అడిగారు. రూ.9వేల కోట్ల అవినీతిపై దర్యాప్తు జరపాలని సీఎం రేవంత్ అంటున్నారని, మరి రూ.లక్ష కోట్ల స్కామ్ గురించి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. రేవంత్ రాసిన లేఖలను కరపత్రాల రూపంలో ఇంటింటికీ పంచుతామన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు దిల్లీ టూర్‌పై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి అన్నారు. మహిళలు ఉన్నతస్థాయికి వెళ్లాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని తెలిపారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు. విపక్షాల కుటుంబాల్లోని మహిళలకు పదవులు వస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగితే సీఎం రేవంత్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. రాహుల్ గాంధీ సీట్లో కూర్చోవాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు వీగిపోవడానికి స్టాలిన్, రేవంత్ రెడ్డిలేû కారణమని ఆరోపించారు. బీజేపీ, బీఆరఎస్ ఎప్పటికీ కలవవని, కలిసి పోటీ చేయవని బండి సంజయ్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





