పాలమూరు-రంగారెడ్డిపై అవాస్తవాల ప్రకటన

– 95శాతం పూర్తయినట్లు రుజువు చేస్తే రాజీనామా : మంత్రి వాకిటి 

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 21: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్ విసిరారు. మంగళవారం ఆయ‌న‌ మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 95 శాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిరూపిస్తే ఇక్కడి నుంచి వెళ్లి ఇప్ప్పుడే రాజీనామాకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాదు రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇంకా భ్రమల్లో ఉన్నారని, ఆయన మాటలకు విశ్వసనీయత లేదని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని మంత్రి వాకిటి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *