“ఈ ప్రభుత్వాలు నిర్బంధాలు కొనసాగిస్తున్నప్పుడు, అమాయకులైన యువకులను ఎన్కౌంటర్ చేసినప్పుడు వారి దేహాన్ని ధైర్యంగా వారి కుటుంబ సభ్యులకు ఇచ్చి అండగా నిలిచే వారు ఈ తెగువ, ప్రశ్న ప్రమాదంలో పడింది.ధిమాక్ ఉన్న ప్రతి ఒక్కరూ జైల్లలో ఉన్నారు.తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం పై నేడు అచేతన వ్యవస్థ లోకి నెట్టి వేసింది..”
కాళోజి నిరంతరంగా అన్యాయాలను, ఆక్రమణలు ఖండిస్తూ సామాజిక బాధ్యతతో కలాన్ని ఖడ్గంగా ఉపయోగించారు. దీనికి ప్రేరణ ఖలీల్ జిబ్రాన్ రచించిన ప్రోఫెట్ ను జీవన గీతం పేరు తో తెలుగులోకి అనువాదం చేశాడు .అలాగే కాళోజీ మేనమామ ఆర్య సమాజ్ నాయకుడు ప్రేరణతో పెరిగాడు. హైదరాబాదులో ఉన్నప్పుడే కాళోజీకి గణేష్ ఉత్సవాలతో, ఆర్యసమాజితో సంబంధం ఏర్పడింది 1930 నుంచి కాళోజి గ్రంథాలయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. సాహిత్య రంగంలోనే కాకుండా సామాజిక రాజకీయ ఉద్యమాలలో అగ్రగామిగా నిలిచారు. 1939లో 25 సంవత్సరాల యువకుడిగా కాలోజీకి మొదటిసారి జైలు శిక్ష పడింది. విద్యార్థి దశలోని వయసుకు మించిన నాయకుడిగా ఎదిగారు. ఇతర నాయకుల కంటే భిన్నంగా ప్రజలను కదిలించేలా ఉపన్యసించడానికి పదునైన గేయాలు తోడ్పడుతాయని గుర్తించారు అందుకే స్వరాన్ని సైరన్ గా కలాన్ని కాహాళిగా మార్చిండు .
అందుకే అన్యాయాన్ని ఎదిరించేవాడు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించారు… కాళోజి సంకుచితమైన ప్రాంతీయ వాది కాదనడానికి 1941 నల్గొండ జిల్లా చిలుకూరు గ్రామంలో రావి నారాయణరెడ్డి గారి అధ్యక్షతన 8వ నిజామాంధ్ర మహాసభ జరిగింది. నిజాం ప్రభుత్వం కొనసాగిస్తున్న నిరంకుశ పాలనను వ్యతిరేకించే రాజకీయాల గురించి చర్చించారు.తెలంగాణ అంటే తెలంగాణేతరుల పట్ల వ్యతిరేకత భావం కాదని కాళోజి ప్రసంగించారు .ఈ ఉపమానం పలువురుని ఆకర్షించింది. అట్లాగే తెలంగాణ రైతాంగం పోరాట కాలంలో కాళోజి ఆనాటి భూస్వాములు అణిచివేతను పోలీసుల దౌర్జన్యాలను నిరసిస్తూ కవిత నల్లగొండలో నాజీ వృత్తుల నగ్నత్యం ఇంకెన్నాళ్లు ,
పోలీసుల దౌర్జన్యాలు, పోషణ ఇంకెన్నాళ్లు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలు వెలిగేదెన్నాళ్ళు అంటూ ఇండియాలో తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశత్వం కింద నలిగిపోతున్నదిని ఆవేదన చెందారు.ప్రపంచ నియంతలకే దిక్కులేదు నీ దిక్కెంత అని నిజామును నిలదీశాడు. అలా తెలంగాణకు ఏ రకంగా అన్యాయం జరిగిన జరిగినదంతా చూస్తూ ఊరుకోవడానికి సాక్షి భూతున్ని కాదు సాక్షాత్తూ మానవుణ్ణి మనిషి తత్వాన్ని వెలిబుచ్చారు…
1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికై శాసన మండల కి ప్రభుత్వానికి కునుకు లేకుండా చేశాడు .ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే పాలకులకు ధిక్కారం వినిపించారు. ఎమర్జెన్సీ కాలం లో మహా మహా న్యాయమూర్తులు మౌనంగా ఉన్నప్పుడు పౌరుల ప్రాథమిక హక్కుల మీద ఉక్కు పాదం మోపినప్పుడు హక్కుల రక్షణ కోసం పోరు సల్పిన పౌర హక్కుల కార్యకర్త.. కాళోజి నుంచి స్ఫూర్తి ..గొప్ప ప్రజాస్వామ్య వాది..నీ అభిప్రాయంతో నేను ఏకీభవించక పోయినా నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకుని నీ హక్కు కోసం అవసరమైతే నేను నా ప్రాణాన్ని ఫణంగా పెడతానని ఫ్రెంచ్ మేధావి వోల్టేర్ అన్న మాటలు కాళోజిని అమితంగా ప్రభావితం చేసింది.
ప్రజాస్వామ్య తత్వం అంటే అందరూ ఓట్లు వేయడం కాదు మనతో ఏకీభవించని వాళ్లను కూడా మనం గౌరవించడం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అలవర్చుకోవడం విమర్శను, అసమ్మతిని స్వీకరించడం ,ఒకరి అభిప్రాయాలను ఇష్ట ఇష్టాలను ఇంకొకరి మీద బలవంతంగా రుద్దకపోవడం .ఇది ప్రజాస్వామ్య జీవనతత్వంగా మారాలి. కళ్ళముందే జరుగుతున్న నృత్యాలను దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించే వారు.ఈ దేశానికి ప్రధానమంత్రి గా పనిచేసిన పి వి నరసింహారావు కూడా కాళోజీ అంటే భయపడే వారు.కాని అమితంగా ప్రేమను వ్యక్తం చేసేవారు.ఈ ప్రభుత్వాలు నిర్బంధాలు కొనసాగిస్తున్నప్పుడు, అమాయకులైన యువకులను ఎన్కౌంటర్ చేసినప్పుడు వారి దేహాన్ని ధైర్యంగా వారి కుటుంబ సభ్యులకు ఇచ్చి అండగా నిలిచే వారు ఈ తెగువ, ప్రశ్న ప్రమాదంలో పడింది.ధిమాక్ ఉన్న ప్రతి ఒక్కరూ జైల్లలో ఉన్నారు.తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం పై నేడు అచేతన వ్యవస్థ లోకి నెట్టి వేసింది.
బెల్లంకొండ హరికృష్ణ
తెలంగాణ విద్యావంతుల వేదిక
7569466184





