Tag Telugu literature

టీచర్ హైకూ సమయాలు-చిత్తలూరి

బలపం పట్టిన్రోజు తెలియలేదు చాక్ పీస్ పట్టేదాకా ఎదుగుతానని * నా ఐదు వేళ్లను లోపలికి పంపించే నా ఆరో వేలు సుద్దముక్క * మాసార్లు తన్నామని చెపితే ఇంకా తన్నమనెటోళ్లు మా అమ్మా నాన్నలు * తెలుగులో తప్పుల్రాస్తే బూతులని తిట్టేది మా టీచర్ * గుణితమొచ్చేది కాని గణితమసలొచ్చేది‌కాదు నాకు * మా…

లిటర(రీ)సీ-బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు సభ మొదలయ్యింది. సభికులు ప్రజలు కాదు, పాఠకులు. ఆ పాఠకులు కూడా వొకప్పటి రచయితలే. రచయితల సభలో రచయితలు కాక యెవరు యెందుకు వుంటారని గడుసుగా సమాధానం యివ్వగలరు కూడా నిర్వాహకులు. ఆమాటకొస్తే నిర్వాహకులు కూడా రచయితలే. అంచేత అందరూ రచయితలే అని చెప్పుకుంటే గొప్పగా గర్వంగా వుంటుంది. సాహిత్యోద్యమాలు జరిగిన నేలమీద సాహిత్య…

కాలంతో నిరంతరం ప్రవహించే ధిమాగి కాళోజీ..

“ఈ ప్రభుత్వాలు నిర్బంధాలు కొనసాగిస్తున్నప్పుడు, అమాయకులైన యువకులను ఎన్కౌంటర్ చేసినప్పుడు వారి దేహాన్ని ధైర్యంగా వారి కుటుంబ సభ్యులకు ఇచ్చి అండగా నిలిచే వారు ఈ తెగువ, ప్రశ్న ప్రమాదంలో పడింది.ధిమాక్ ఉన్న ప్రతి ఒక్కరూ జైల్లలో ఉన్నారు.తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం పై నేడు అచేతన వ్యవస్థ లోకి నెట్టి వేసింది..” సమాజం ఆపత్కాలంలో,ప్రశ్న వెనుకబడిందని…

ఊపిరి- గిరి ప్రసాద్ చెలమల్లు

ఔను వాళ్ళేమీ తత్వశాస్త్రాన్ని చదవలేదు పదిహేను ఇరవై ఏళ్ళ మధ్య వారే పుస్తకాలతో కుస్తీ పట్టి ఈ దేశంలో నైపుణ్యత సాధించాలనే తపన గలవారే! ఒకే ఒక్క లీక్ కాదు వందల లీకులు భవిష్యత్ అంధకారమై పోతుందనే కోపం ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఇక లాభం లేదని అడుగులు రాజధానివైపు పడ్డాయి ఒక్కో గొంతు పెగులుతుంటే…

ప్రతీక-బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు “ఇదేంటి మీ వూళ్ళో వొక్క గుడీ లేదు?” “మమ్మల్ని గుడిలోకి రానివ్వలేదు, అందుకని మా వూళ్ళోకి గుడిని రానివ్వలేదు!” “మరి మీకు దేవుడు వుండొద్దా?” “మీకొక దేవుడూ మాకొక దేవుడూ వుండొద్దు!” “హు… దేవుడు లేని అనాథలైపోరూ?” “భక్తులు లేని దేవుడు కూడా అనాథే!” “సరే, మీకు కష్టమొస్తే నష్టమొస్తే యెవరికి చెప్పుకుంటారు?”…

ఆడెపు లక్ష్మీపతి ఓ ‘చైతన్య స్రవంతి’

చెమ్మ : వారాల ఆనంద్ తెలుగు కథాసాహిత్యంలో కొంతమంది రచయితలు ఎక్కువ కథలు రాయకపోయినా, మనసుపెట్టి రాసిన ప్రతికథ కొత్తదనంతో వినూత్నంగా వుండి పాఠంలానూ అధ్యయనం చేయాల్సిన రచనగానూ నిలబడుతుంది. అంతేకాదు ఆ రచయిత చేసిన విమర్శ కూడా సాహిత్యంలో దిక్సూచిలా నిలుస్తుంది. అలాంటి అరుదైన రచయితల్లో ఆడెపు లక్ష్మీపతి ఒకరు. ఆయన కేవలం కథలు…

పరాయి!- బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు కొత్త పెళ్ళికూతురులా కళకళలాడుతూ వుంది కొత్త యిల్లు! కన్నులు పట్టనట్టుగా యింటిని చూస్తున్నాడు అతడు. అతని ముఖంలో తృప్తి కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. ఇల్లంతా కలియదిరిగాడు. చలువరాతి గచ్చుమీద పడి పొర్లాడు. బోర్లా పడ్డాడు. వెల్లకిలా పడ్డాడు. తల్లి గుండెలమీద పసి పిల్లాడిలా ఆదమరిచి నిద్రపోయాడు. అంతలోనే వులిక్కిపడి ఫ్లోర్ మీంచి లేచాడు. ఏదో…

నిశ్శబ్ద దీపస్తంభం

చెమ్మ : వారాల ఆనంద్ తెలంగాణ సాహిత్యచరిత్రలో జువ్వాడి గౌతమరావుది ప్రత్యేక వ్యక్తిత్వం. ఆయన కవి, విమర్శకుడు, వ్యాసకర్త, అనువాదకుడు, సాహిత్యప్రచారకుడు మాత్రమేకాదు, సాహిత్యాన్ని జీవనవిధానంగా స్వీకరించిన అధ్యయనశీలి. విద్యార్థిదశ నుంచే సాహిత్యం, సామాజిక చైతన్యం, స్వాతంత్ర్యోద్యమ భావజాలాలతో మమేకమయ్యారు. నిజాం వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించడం ఆయన సామాజిక నిబద్ధతకు నిదర్శనం. గౌతమరావు సాహిత్యజీవితంలోనూ…

చాగంటి తులసి కథా విశ్లేషణ – 1

“యాష్ ట్రే వంటి మంచి కథలు రాసిన రచయిత, అనువాదం, విమర్శ, నాటకం, పరిశోధన రంగాల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్య ఉద్యమశీలి- చాగంటి తులసి తొంభయ్యవ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా తిరునగరి దేవకీదేవి రాసిన విమర్శనాత్మక వ్యాసాన్ని నాలుగు వారాల పాటు శోభ పాఠకుల కోసం ప్రచురిస్తున్నాము.” – శోభ…