“కేసీఆర్ లాంటి తెలంగాణ టవరింగ్ పర్సన్ చావును కోరుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు అంటే ఆ పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి పక్ష నేత చావు కోరుకుంటున్న డప్పు కొట్టడం దళితవాదం అనిపించుకోదు. మూర్ఖత్వం అవుతుంది. ఏ దళితుడు ఒక వ్యక్తి చావు కోరుకోడు. ఒకరకంగా దళితులను అధికారాన్ని నిలుపుకునే అగ్ర దళిత నేతలు ఆడుతున్న చదరంగంలో పేద మధ్యతరగతి దళితులను పావుగా మార్చుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి చావును కోరుకోవడం నేరం. అలాంటిది కేసీఆర్ చావు కోరుకుంటున్నాం అని చెప్పడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం..”
తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా దిగజారి పోయాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి గత మూడేళ్లలో రాష్ట్ర శాసనసభ ఔన్నత్యాన్ని పూర్తిగా దిగజార్చుతోంది. ప్రతీకార రాజకీయాలకే కేంద్రంగా అసెంబ్లీని కాంగ్రెస్ మార్చింది. వెండేటా పాలిటిక్స్ తో చట్టసభల స్థాయిని దిగజార్చుతోంది .ప్రత్యార్థులపై ఆధిపత్యం కోసం చేసే ప్రయత్నంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. .రాష్ట్రంలో అనేక ప్రజ సమస్యలున్నాయి.ఒకవైపు తెలంగాణపై భయంకరమైన కరువు కమ్ముకొస్తుంది. గ్రామాలు పట్టణాల్లో సాగు తాగు నీటి సంక్షోభం ముంచుకొస్తోంది. మరోవైపు పక్క రాష్ట్రాలు జూలై దోపిడీ చేస్తున్నాయి. ప్రాజెక్టులపై కుట్రలు జరుగుతున్నాయి. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. రాష్ట్రంలో భూకబ్జాలు ల్యాండ్ మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఒకవైపు తాగు నీటి కష్టాలు కొనసాగుతుంటే మరోవైపు లిక్కర్ ఏరులై పారుతుంది. 22A బాధితులు, విద్యార్థి నిరుద్యోగులు, రైతులు అనేక కష్టాలు పడుతున్నారు.
కాంగ్రెస్ ది ప్రజాపాలన విఫల పాలన. ఎమర్జెన్సీ పాలన. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా అధికార ట్రెజరీ బెంచ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. వెయ్యి రోజల పాలనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతి పక్షం సిద్ధమైతే డిఫెన్స్ నుంచి అఫెన్స్ లో పడేందుకు చిల్లర రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ తెర తీసింది. అసెంబ్లీ సమావేశాలకు వెలుతున్న ప్రతి పక్ష నేతలను పోలీసులు అడ్డుకోవడంతో, విపక్షాల నేతలప, మహిళలని చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు సమాజం సిగ్గుపడేలా ఉంది. అటు తాతా మధు చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరం కరమైనవే. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంది. సమావేశాల నుంచి గట్టెక్కేందుకు అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ పూర్తిగా తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తోంది. దళిత కార్డు పేరుతో రాజకీయాలు చేస్తోంది. ప్రజల సమస్యల్ని గాలికి వదిలి అనవసరమైన చర్చతో రెండు రోజుల విలువైన అసెంబ్లీ సమయం వృధా చేశారు. అసెంబ్లీ గేట్ దగ్గర జరిగిన ఘటనలపై స్పీకర్ విచారణకు ఆదేశించి, తాతా మధు తన వ్యాఖ్యలపై విచారణ వ్యక్తం చేసినప్పుడు స్పీకర్ హుందాగా వ్యవహరించి చర్చను ముందుకు తీసుకెళ్ళితే బాగుండేది. క్షమాభిక్ష, ఆత్మ విమర్శకు మించిన శిక్ష ఉండదు.
అయితే అధికార పార్టీ ఇష్యూను కొనసాగిస్తూ చర్చను డైవర్షన్ చేస్తూ, అసలు విషయాలపై చర్చ లేకుండా ప్రజా ధనం వృధా చేయడమే కాదు, ప్రజల సమస్యలపై చర్చించే ధైర్యం అధికార పార్టీలో కనిపించడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దళిత కార్డుతో దళితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమే చేస్తోంది తప్ప దళితులపై నిజంగా అధికార పార్టీలో ప్రేమ కనిపించడం లేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి దళితులపై ప్రేమ ఉంటే ఇవాళా ఇంకా దేశంలో దళితులు వివక్షను అనుభవించేవారు కాదు. దళితవాదం పేరుతో కాంగ్రెస్ ఇవాళా రాష్ట్రంలో రాజకీయాలు చేయాలని చూస్తుంది తప్ప ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన, స్పీకర్ పదవి ఇచ్చినంత మాత్రాన మొత్తం దళిత జాతికి వచ్చినట్టు కాదన్నదని గ్రహించాలి.
మరోవైపు రాష్ట్రంలో దళితవాదం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తే ప్రతి పక్షం బీసీ వాదం, మహిళా వాదాన్ని ఎత్తుకుంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీ గేటు వద్ద మహిళా పోలీసులను పెట్టి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసే వ్యూహాలు అమలు చేసింది. ప్రతి పక్షం కూడా స్పీకర్ పై తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మహిళా సెంటిమెంట్ రాజకీయాలు చేసింది. ఈ రెండు వైపులా ఎపిసోడ్ లో మహిళా వాదం, స్త్రీవాదం కేంద్రంగానే అసెంబ్లీ సమావేశాలు వైప్ ఔట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మరో అంశం కూడా కాంగ్రెస్ నేతలు పదేపదే మాట్లాడుతున్నారు. ఏకంగా కేసీఆర్ చావు కోరుకుంటున్నాం. చావు డప్పు కోడతం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు. తమ వ్యక్తిగత గడ్స్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం దళితుల అభిప్రాయంగా చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు ఏకంగా అసెంబ్లీ సమావేశాల్లోనే కత్తులు కోలాటం ఆడుతామంటు మాట్లాడుతున్నారు.
నిజానికి దళితులు ఏనాడు ఎవ్వరీ చావును కోరుకోలేదు. కోరుకోరు కూడా. సహచర జాతి బాగుకోరంకుంటారు తప్ప శత్రువు చావును ఏనాడూ కోరుకోరు. కానీ ఇవాళా కాంగ్రెస్ పార్టీలో దళిత ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు..?. కేసీఆర్ లాంటి నేత చావును కోరుకుంటున్నాం అంటూ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఇది మొత్తం దళిత జాతి అభిప్రాయమైతే కాదు. ఇది కేవలం కేసీఆర్ పై ప్రతీకార రాజకీయాలు చేసే వెండేటా పాలిటిక్స్. మరోవైపు కేసీఆర్ పదేపదే అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలంటున్నారు. అయితే అసెంబ్లీ ప్రారంభం రోజు అసెంబ్లీ గేటు ముందు ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు లోతుగా పరిశీలిస్తే కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న డిమాండ్ వెనుక లోతైన కుట్రలు ఉన్నాయి అనిపిస్తుంది. కేసీఆర్ అసెంబ్లీకి వేస్తే అవమానించడమే కాదు , ఏకంగా నిన్నటిలాంటి సంఘటల ముసుగులో దాడి కూడా చేసే ప్లాన్ ఏమైనా చేసిందా అన్న అనుమానాలు తెలంగాణ సమాజంలో వ్యక్తం అవుతోంది.
పదేపదే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కేసీఆర్ చావుకోరుకుంటున్నాం, కేసీఆర్ చావు డప్పు కొడతాం, కత్తుల కోలాటం ఆడుతాం అంటున్న కాంగ్రెస్ నేతలు మాటల వెనుక కేసీఆర్ పై దాడి చేయాలన్న బలమైన కుట్రలు ఉన్నట్లు వీరి మాటల వెనుక ఉద్దేశం కనిపిస్తుందని తెలంగాణ ప్రజలు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నేతల కోసం కేసీఆర్ చావు డప్పు కొడతాం, కేసీఆర్ చావు కోరుకొట్టాం అని మొత్తం దళిత సమాజం అభిప్రాయంగా చిత్రికరించడం సిగ్గు చేటు. కేసీఆర్ చావు కోలుకునేందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారా..?.
మరోవైపు తాతా మధు వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని ఏకంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీనే రద్దుచేయాలని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండలిలో డిమాండ్ చేస్తున్నారు. అసలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసే అధికారం తెలంగాణ అసెంబ్లీకి ఉంటుందా..? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుందా..?. మొదటి నుంచి తెలంగాణ తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. సంక్షేమం అమలు చేయాలన్న ఉద్దేశం కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కేసీఆర్ చావు కోరుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండాగా మారింది. దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడకుండా దళితవాదం పేరుతో రాజకీయాలు తప్ప దళితులను ఉద్ధరించింది లేదు. చివరికి ఇందిరా గాంధీ పేదలకు పంచిన భూములను ఇవాళా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు కబ్జాలు చేస్తున్నారు. ఇందిరా ఇచ్చిన ఇంటి జాగాలో కట్టుకున్న ఇళ్ళను కూడా హైడ్రా పేరులో కూల్చివేస్తోంది.
దళితుల పేరుతో కాంగ్రెస్ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది తప్ప దళితులకు చేసిందేమీ లేదు.దాదాపు ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్య భారత్ లో దళితులు ఇంకా అంటరానితనం ఎదుర్కోంటున్నారంటే దానికి కారణం ఆరు దశాబ్దాలు పాలన చేసిన కాంగ్రెస్ దే. ఇవాళా దళితుల కోసం చేస్తున్న కాంగ్రెస్ డ్రామా అంతా రాజకీయ మైలేజ్ కోసం తప్ప దళిత జాతి ఉద్ధరణ కోసం కాదన్నది సుస్పష్టం. కేసీఆర్ లాంటి తెలంగాణ టవరింగ్ పర్సన్ చావును కోరుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు అంటే ఆ పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి పక్ష నేత చావు కోరుకుంటున్న డప్పు కొట్టడం దళితవాదం అనిపించుకోదు. మూర్ఖత్వం అవుతుంది. ఏ దళితుడు ఒక వ్యక్తి చావు కోరుకోడు. ఒకరకంగా దళితులను అధికారాన్ని నిలుపుకునే అగ్ర దళిత నేతలు ఆడుతున్న చదరంగంలో పేద మధ్యతరగతి దళితులను పావుగా మార్చుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి చావును కోరుకోవడం నేరం. అలాంటిది కేసీఆర్ చావు కోరుకుంటున్నాం అని చెప్పడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.
నిజానికి సోమవారం అసెంబ్లీ గేటు దగ్గర జరిగిన ఘటనతో బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. కాంగ్రెస్ పార్టీ అయితే కేసీఆర్ చావు కోరుకుంటున్నాం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రకటనలతో కాంగ్రెస్ రాజకీయాలపై ప్రజలు అసహ్యించుకునే పరిస్థితిని వచ్చింది.
తోటకూర రమేష్





