ఎల్‌నినో, కరువు పరిస్థితులపై రేపు అఖిలపక్షం

– భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం లోటు నేపథ్యంలో ప్రజలు, రైతులపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటికి విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వంటి కీలక అంశాలపై రాజకీయ పార్టీల నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కరువు నివారణకు అనుసరించాల్సిన వ్యూహాలు, అవసరమైన ముందస్తు చర్యలపై అఖిలపక్ష నేతల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. రాష్ట్రంలో కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *