– 100 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ
హైదరాబాద్, ఆగస్టు 19 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో/ఎంసీసీ ఆధ్వర్యంలో మెడ్ ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 25న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా జరగనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో(యూఈఐజీబీ-ఎంసీసీ)కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్టుకు చెందిన 100 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఏదేని డిగ్రీ చేసిన యువతీయువకులు 18 నుండి 30 సంవత్సరాల వయసు వారికి ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో చీఫ్ టి.రాము ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫార్మసిస్టుకు నెలకు రూ.25,000, అసిస్టెంట్ ఫార్మసిస్టుకు రూ.16,000 వరకు వేతనం ఉంటుంది. వివరాలకు సాయి శైలేష్, హెచ్ ఆర్ ఫోన్ 9666662481ను సంప్రదించాలి. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో వద్ద నేరుగా 25న హాజరు కావాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





