24న ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

– 100  ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలోని వంద ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డి- ఫార్మసీ, బి-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, డిగ్రీ చేసిన 18 నుండి 30 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (యూఈఐ అండ్ జీబీ/ఎంసీసీ) ఒక ప్రకటనలో తెలియజేసింది. రూ.12,500 నుండి రూ.25,000 వేల వరకు వేతనం ఉండే ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలకు టి.రఘుపతి, హెచ్ఆర్ (ఫోన్ 82476 56356)ను సంప్రదించాలని కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో వద్ద నేరుగా 24న హాజరు కావాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *