తమిళనాడు స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్

– డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్ ఎన్నిక

చెన్నై, మే 12: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీవీకేకు చెందిన మరో ఎమ్మెల్యే రవిశంకర్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రోటెం స్పీకర్ ఎంవీ కరప్పయ్య తెలిపారు. తొలుత ప్రభాకర్ నామినేషన్‌ను ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ప్రతిపాదించారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అనంతరం ప్రోటెం స్పీకర్‌గా తన పాత్ర ముగిసినట్టు కరుప్పయ్య ప్రకటించారు. ఆ వెంటనే సభాసాంప్రదాయం ప్రకారం స్పీకర్ ప్రభాకర్‌ను ఆయన చైర్ వరకూ సభానేత కేఏ సెంగోట్టియన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తోడ్కొని వెళ్లారు. ఆయనకు అభినందనలు తెలిపారు. స్పీకర్‌గా ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే డిప్యూటీ స్పీకర్ ఎన్నికను చేపట్టారు. డిప్యూటీ స్పీకర్ పదవికి తురైయూర్ టీవీకే ఎమ్మెల్యే ఎం.రవిశంకర్ ఒక్కరే నామినేషన్ వేశారని, దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైందని ప్రభాకర్ ప్రకటించారు. రవిశంకర్ నామినేషన్‌ను సెంగోట్టియన్ ప్రతిపాదించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *