– బీదర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
– ఐదుగురి మృతి.. వారిలో ఇద్దరు సంగారెడ్డి వాసులు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 12 : కర్ణాటకలోని బీదర్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్‌ను కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బీదర్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు సంగారెడ్డి జిల్లావాసులు ఉన్నారని పోలీసులు వివరించారు. బీదర్ నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బీదర్ హాస్పిటల్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




