– కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు
– కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలుకరీంనగర్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చను, ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభపై దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘సీబీఐ డ్రామాలాడుతున్నారని’ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా ఖాజీపూర్‌లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో రైతులు చనిపోతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు నెల రోజులైనా వడ్లను కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడతారా? మండుటెండలో రైతులు పడుతున్న వెతలు కన్పించడం లేదా? తాలు, తరుగు సాకుతో కిలోల కొద్ది వడ్ల కటింగ్ చేస్తారా అని నిలదీశారు. కొనుగోలు టోకెన్లు ఇచ్చేందుకు కూడా దళారులు కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. రైతుల బాధలు తెలుసుకునేందుకు ఇయాళ ఖాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చాను. రైతుల బాధలను కళ్లారా చూస్తున్నా. మండుటెండలో రోజుల తరబడి వాళ్లు వడ్లను విక్రయించేందుకు పడిగాపులు కాస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు. ఈ సందర్భగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి స్పందిస్తూ “ఇంకెంతమంది రైతులను బలి కొంటారు? రైతులు చనిపోతున్నా వడ్లను కొనుగోలు చేయరా? కొనుగోలు కేంద్రాలవద్ద అరిగోస పడుతున్నా స్పందించరా? ప్రతి గింజకు కేంద్రమే పైసలిస్తుంటే కొనడానికి మీకున్న ఇబ్బందేమిటి? వడ్లు కొన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమీషన్ కూడా ఇస్తున్నాం కదా? వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళితే మంత్రులను రైతులు కొట్టేటట్లు ఉన్నారు. కొనుగోలు కేంద్రాలవద్ద టోకెన్లు ఇవ్వడానికి కూడా కమీషన్లు దండుకుంటున్న దుర్మార్గులు. తాలు, తరుగు, తేమ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నా స్పందించరా వాస్తవాలు మాట్లాడితే మాపై ఎదురు దాడి చేస్తారా అని ప్రశ్నించారు.

ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదలకు డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. ఫీజురీయింబర్స్ మెంట్ కూడా ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు.కేంద్రం ఎస్టీ విద్యార్థుల రీయింబర్స్ మెంట్ కోసం నిధులు మంజూరు చేసినా వాడుకోలేదు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై ఎంక్వైరీ కమిషన్ నివేదిక ఇచ్చి ఏడాదిన్నర దాటినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము మీకు లేదా? కేసీఆర్ తో ఇన్నాళ్లు బేరసారాలాడారా?. బేరసారాలు చెడిపోయాయి కాబట్టే కేంద్రానికి లేఖ రాస్తున్నారా?. మా భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్ ను కాల్చాలనుకుంటున్నారా?. ఐదు రాష్ట్రాల ఫలితాలను డైవర్ట్ చేసేందుకే సీబీఐ డ్రామాలు. రేవంత్ రెడ్డి…మీకు కేసీఆర్ ను అరెస్ట్ చేయడం చేతగాదని ఒప్పుకుంటారా?. అదే విషయాన్ని కేంద్రానికి రాసే లేఖలో చెప్పాలి. రేవంత్ రెడ్డికి చేతగానికి ఒప్పుకుని కేంద్రానికి లేఖ రాస్తే సీబీఐ విచారణపై కేంద్రం స్పందిస్తుందని బండి సంజయ్ అన్నారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.