“జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఆర్సి ప్రకటించి ఉద్యోగుల్లో ఉన్న సంతృప్తి తొలగిస్తుందని ఆశాజనకంగా ఉన్న సందర్భంలో .. ఉద్యోగులకు జూన్ 1 నుండి హెల్త్ కార్డులు అమలుకు తెస్తామని చెప్పిన ప్రభుత్వం, అందుకు అనుకూలంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఎక్కడ ఎక్కిన అధికారుల తొందరపాటు వల్ల ఉద్యోగుల పెన్షనర్ల జీతాల్లో ఒకటి పాయింట్ ఐదు శాతం కోత విధించడం వివాదాస్పదంగా మారింది..”
“సమైక్య రాష్ట్రంలో సకలజనుల ఆకాంక్షలు నెరవేరవు! ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు నెరవేరుతాయి!!”
– ప్రొఫెసర్ జయశంకర్.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగితే ఏమొస్తది సార్ అని అడిగినప్పుడల్లా ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండుతాయి, సకల జనులకు విద్యా వైద్యం ఉచితంగా అందించబడుతుంది నీళ్లు నిధులు నియామకాలు ఈ ప్రాంత బిడ్డలకే దక్కుతాయని, పాలకులు ఇక్కడి వాళ్లే కనుక ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డంకులు తొలగుతాయని పదే పదే తన ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్యపరచిన ప్రొఫెసర్ జయశంకర్ గారి మాటలు తెలంగాణ ఆవిర్భావ పుష్కర కాల సందర్భంగా పదేపదే గుర్తుకొస్తున్నాయి.

నీళ్లు నిధులు నియామకాల పట్ల తెలంగాణ
దశ దిశ దారి తప్పిపోతున్నదనీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తేటతెల్లo చేస్తున్నది . ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదని ఉద్యోగులకు అందవలసిన బకాయిలు, పెన్షన్ బెనిఫిట్ దఫాలుగా గా చెల్లిస్తున్నది.విద్యారంగంలో గత ప్రభుత్వం ఆశించిన కేజీ టు పీజీ, మన ఊరు మన బడులన్నీ మూతపడుతూ, ఇప్పుడు కొత్త యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ గా , తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ రూపం తీసుకుంటున్నవి. ఒక్కో బడికి 25 రకాల స్థలం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో 2500 మంది పిల్లలకు విద్యనందించే భారీ విద్యా కేంద్రాలు నెలకొల్పబడుతున్నాయి.ఇంకోవైపు విద్యా కమిషన్ సూచించిన విద్యారంగానికి 18 శాతం నిధులు కేటాయించాలని చేసిన ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కాలేదు. విద్యా కమిషన్ చైర్మన్ తన నివేదిక ఆచరణలో ప్రభుత్వం కనబరూస్తున్న అనాసత్తతకు నిదర్శనంగా రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఆర్సి ప్రకటించి ఉద్యోగుల్లో ఉన్న సంతృప్తి తొలగిస్తుందని ఆశాజనకంగా ఉన్న సందర్భంలో .. ఉద్యోగులకు జూన్ 1 నుండి హెల్త్ కార్డులు అమలుకు తెస్తామని చెప్పిన ప్రభుత్వం, అందుకు అనుకూలంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఎక్కడ ఎక్కిన అధికారుల తొందరపాటు వల్ల ఉద్యోగుల పెన్షనర్ల జీతాల్లో ఒకటి పాయింట్ ఐదు శాతం కోత విధించడం వివాదాస్పదంగా మారింది.
అసలు కార్పొరేట్ హాస్పిటల్స్ ఆమోదించకుండానే ఏ ఏ హాస్పిటల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన అంగీకరించే తెలియకుండానే, ఉద్యోగులు ఇంకా కార్డులను ఆపరేట్ చేయకముందే, అనేక అనుమానాల మధ్య జీతాల కోత ఉద్యోగుల్లో ఆవేదనను ఆక్రోశాన్ని రగిలించింది. ఆరోగ్యశ్రీ కార్డుకు 46000 చెల్లించే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ఆపరేషన్లకు 18000 కేటాయిస్తే మేము ఎందుకు ఆమోదిస్తామని ప్రైవేట్ హాస్పిటల్స్ నిరాకరిస్తుంటే హెల్త్ కార్డుల వ్యవహారం హెల్ప్ లెస్ కార్డులుగా మారిపోయింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావం అనంతరం పుష్కరకాలం గడిచిన తెలంగాణలో గతంలో తెలంగాణ అమరుల త్యాగాల ఫలితంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వం ఏమి సాధించలేదన్న విమర్శతో అధికారంలో కూర్చుని ఇప్పటి ప్రభుత్వం కానీ అసలు తెలంగాణ అమరుల త్యాగాల మీద వాళ్లు ఆశించిన లక్ష్యాల సాధనలో ఎందుకు విఫలమవుతున్నాయో ఆలోచించవలసి ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో నీళ్లు నిధులు నియామకాలతో పాటు, అందరికీ విద్య వైద్యం ఉచితంగా అందుతుందన్న భరోసా కనుమరుగైపోయింది. కేవలం 3 లక్షల మంది ఉద్యోగులు మూడు లక్షల మంది పెన్షనర్ల ఆరోగ్య భద్రత గురించి ఇంత రసాభాస చేస్తున్న ప్రభుత్వం, అసలు ప్రజలందరికీ ఉచిత వైద్యం ఇచ్చే అందించేటువంటి సంకల్పాన్ని విడనాడిందని జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ సాధనలో ప్రాణాలర్పించిన వారు ,గాయపడిన వాళ్లు, ఆర్థికంగా నష్టపోయినవాళ్లు జైలు పాలైన వాళ్ళు కేసులు ఇరుక్కున్నవాళ్లు తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తిమంచి వారికి సహకరించడానికి కమిటీ వేయడం అభినందించదగ్గ అంశమే అయినప్పటికీ,
అసలు పోరాటంలో ప్రధాన భూమిక పోషించినటువంటి సకల జనుల ఆకాంక్షల గురించి ఆలోచించకపోవడం తెలంగాణ అమరవీరుల త్యాగాలను పూడ్చి పెట్టడం లాంటిది. తెలంగాణ ఆవిర్భావం కోసం అసువులు బాసిన సుమారు 1500 మంది విద్యార్థి అమరుల త్యాగం కనీసం తెలంగాణలో ఉచితంగా విద్యను అందించాలి దశకు చేరింది. ఆంధ్ర వలస ప్రత్యేక కార్పొరేట్ విద్యాసంస్థలు ఆనాటి నుండి ఈనాటి వరకు దేదీప్యమానంగా ఆరో తరగతికి రెండు లక్షల రూపాయలు తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దండుకునే విద్యావ్యవస్థ కొనసాగుతున్నది.

దీన్ని అదుపు చేసి అందరికీ సమాన విద్య అవకాశాలు అందించవలసిన తెలంగాణ పాలకులు, ఏనుగులు పోయే దారిని వదిలి ఎలుకలు దూరే దారిని మూసినట్లు, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోనైనా కనీసం బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టకుండా, మరో రూపంలో ఒకే పాఠశాలకు 200 కోట్ల రూపాయలు 25 ఎకరాల స్థలం కేటాయించడ ద్వారా, మిగిలిన పాఠశాలలను నిర్వీర్యం చేయటం కళ్ళకు కొడుతున్నది. కేవలం మండలానికి రెండు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నెలకొల్పడంతో అందుకునే వారికే విద్య అందనీ వారికి మిత్రుల తెలంగాణ విద్యారంగం మారిపోయింది. తెలంగాణ భాషా ,సంస్కృతులు, కళలు,సాహిత్యం కనుమరుగైపోతున్నాయి. కేవలం స్కిల్ టు స్కూల్స్ గా కనీసం మాతృభాషలో చదవలేని ఓ కొత్త తరం రూపొందుతున్నది. మానవీయ విలువలను సంస్కృతిని పెంపొందించలేని పాఠ్యాంశాలతో తరగతి గది హింసాత్మకంగా మారుతూ బ్యాట్ కోసం తోటి స్నేహితులన కత్తితో పొడిచే హింస నేర ప్రవృత్తి పెరగడానికి కారణమైన , గంజాయి మత్తుమందుకు బానిసలు గా మారి, అధికార అండంతో అమ్మాయిల మీద ఆకృత్యాలకు పాల్పడే సంస్కృతి తెలంగాణలో విలసిల్లడం బాధాకరం. అలాంటి విశృంఖల సినీ సంస్కృతిని తమ సినిమాల ద్వారా విస్తరింప చేసిన ఆంధ్ర ఆధిపత్యం ఇవాళ మళ్లీ పేట్రేగిపోతూ నవ తెలంగాణ నిర్మాణ పేరిట తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెట్ట చూస్తున్నది. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఈ విషయాన్ని ఉద్యమకారులు తెలంగాణ సకలజనులు గుర్తించవలసి ఉంది.
ఎన్టిఏ పేపర్లు తోపాటు, వైద్య విద్యలో కొనసాగుతున్న వివక్ష, కోట్లాది రూపాయలతో వైద్యులుగా మారుతున్న వాళ్లు కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా కొనసాగిస్తున్న ఆరోగ్య దోపిడీ అంచనాలకు దొరకటం లేదు. మామూలు మనిషి కడుపు నప్పికి కాలు నొప్పికకో ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే లక్షలాది రూపాయలు వెచ్చించాల్సిన సందర్భం. ప్రభుత్వ హాస్పిటల్ లో నిరంతరాయంగా వైద్యులు వసతులు పరీక్షలకు సంబంధించిన పరికరాలు బాధ్యతాయుతమైన సేవలు లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ తెలంగాణ ప్రజానీకాన్ని నిలువు దోపిడీ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇవ్వాళ హెల్త్ కార్డుల ప్రహసం కొనసాగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వమే అటు ఆరోగ్యశ్రీలకు ఇటు హెల్త్ కార్డులకు ఉద్యోగుల జీతాల నుంచి కోతలు పెట్టి కార్పొరేట్ వైద్య రంగాన్ని బలోపేతం చేయటం కాకుండా అవే నిధులను ప్రభుత్వ హాస్పిటల్స్ కి అప్పచెప్పి, వైద్య సిబ్బందిని నియామకం చేసి, పరీక్షల పరికరాలు నెలకొల్పి తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా విద్యను అందించే ప్రయత్నం చేయకపోతే తెలంగాణ ఆవిర్భావానికి అమరుల త్యాగాలకు ద్రోహం చేసినట్లు.
జయశంకర్ సార్ అన్నట్లు మా తరం మోసపోయింది ఈ తరం మోసపోకూడదని, సాధించుకున్న భౌగోళిక తెలంగాణ కేవలం 10 శాతం విజయమైన మిగిలిన 90% సకలజనుల ఆకాంక్షలు నెరవేర్చుకునే ఒక సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణగా మార్చుకోవడానికి చేయవలసిన పోరాటంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గుర్తించి ఆ దిశగా ఉద్యమకారులు, తెలంగాణ విద్యావంతులు అడుగేయవలసి ఉంది.
అమరుల త్యాగాల స్ఫూర్తితో..
-ప్రభాకర్ కస్తూరి.
తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్.
మొబైల్:9440970454