తెలంగాణపై కోరలు చాస్తున్న సమైక్య విష నాగులు..!!

“సమైక్యవాదులు తెలంగాణలో కుట్రలు చేస్తునే ఉండాలి, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఉద్యమకారులపై అవాకులు చెవాకులు పేలుతూనే ఉండాలి, ఆ కుట్రలను, ఆ చిల్లర కూతలకు తెలంగాణ సమాజం పదేపదే ఐక్యమవుతూ ఆ ద్రోహుల కుట్రలు భగ్నం చేస్తూనే ఉండాలి. చిల్లర సైనిక్స్ తెలంగాణ సెంటిమెంట్ ను ఎంత రెచ్చగొట్టితే, తెలంగాణ సమాజం పార్టీలకతీతంగా ఏకమవుతుంది. పార్టీలుగా ప్రజలు విడిపోవచ్చు కానీ తెలంగాణ వాదులు అందరూ ఐక్యంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి జై తెలంగాణ అంటే ఆ పవిత్ర నినాదం కు ప్రాంతేతరులు.. వారి తాబేదార్లు గుండెలదురుతాయి ..!”

తెలంగాణ అధికారికంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటికి 13 ఏళ్లు.అనేక పోరాటాలు త్యాగాలు, ఆత్మబలిదానాల తర్వాత 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తు రాష్ట్రపతి జూన్‌ 2న ముద్ర వేశారు.
.త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అమరుల ఆశయాలు ఆకాంక్షలు నెరవేర్చేలా అభివృద్ది సంక్షేమం ప్రజలకు అందుతుందనుకున్నారు. ఉద్యమకారులు, అమరుల త్యాగాల ఫలాలు ప్రజలందరికీ అందుతుందని అనుకున్నవారికి నిరాశ మిగిలిందని చెప్పవచ్చు.తెలంగాణ ఏర్పడి పుష్కరకాలం ముగిసినా  ఇంకా అమరుల ఆకాంక్షలకు అనుకూలంగా పాలన జరగడం లేదు. వారి త్యాగాలకు ఫలితం లేకుండా పాలకులు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ కోసమే పుట్టిన టీఆర్ఎస్‌ / బీఆర్ఎస్‌ పార్టీ తెలంగాణ ఆకాంక్షలకు అనుకూలంగా పాలన చేసినట్లు కనిపించినా అమరుల ఆకాంక్షలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది.తెలంగాణ సోల్‌ను వదిలిపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు దూరమైంది.
.ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుకూలంగా ప్రజాపాలన ప్రజలకు అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ గొర్రెలు తినటోడు పోయి బర్రెలు తినేటోడు వచ్చినట్లు తెలంగాణ ప్రజల బతుకులు పెనం నుంచి పోయిన పడ్డట్లైంది. ఉద్యమాల్లో పుట్టిన టీఆర్ఎస్‌/ బీఆర్ఎస్ కనీసం తెలంగాణవాదాన్ని, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని మాటల్లో అయిన చూపించేంది..పాలనలో ఎలాంటి విధానాలు అమలు చేసిన తెలంగాణవాదం విషయంలో రాజీ పడలేదు. అభివృద్ది సంక్షేమం వ్యవసాయంతో పాటు రాజకీయ ప్రయోజనాల కోసమే పదవి కోసమే అయిన తెలంగాణవాదానికి కూడా ప్రాధాన్యత ఇచ్చింది.
రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణవాదాన్ని పూర్తిగా వదిలేసింది. అమరుల త్యాగాలను, తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం సీమాంధ్ర పార్టీలకు తాకట్టు పెట్టారు.తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు సీమాంధ్రకు ధారాదత్తం చేస్తున్నారు. తెలంగాణవాదం, తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవంపై సమైక్యవాదులు దాడులు చేస్తుంటే కాంగ్రెస్ మౌనంగా ఉంటుంది. పార్లమెంట్ లోపల బయట తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ టీడీపీ జనసేన నేతలు  అవాకు చెవాకులు పేలుతూ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తుంటే కనీసం ప్రతిఘటించే ప్రయత్నం చేయడం లేదు. పాలకులే తెలంగాణ వ్యతిరేకులైన చోట అలాంటి ప్రతిఘటన ఆశించడం కూడా అమాయకత్వమే.. తెలంగాణలో ఇందిరమ్మ పేరుతో ప్రజా పాలన ముసుగులతో తెలంగాణలో సీమాంధ్రుల పాలన చేస్తున్నారు. కత్తిమనదే కన్నుమనదే అన్నట్లు ప్రభుత్వం తెలంగాణది పాలకులు తెలంగాణ వాళ్లే తెలంగాణకు నష్టం చేస్తుంది మన వాళ్లే.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నా, తెలంగాణ బిడ్డలు పాలకులైనా ఆలోచనలు మాత్రం సీమాంధ్ర పార్టీలది. విధానాలు సమైక్యపాలకులది.దేహం తెలంగాణది ఆత్మ వలసపాలకులది.తెలంగాణ వచ్చి ఇవాళ్టికి 13 ఏళ్లు అవుతున్న ఇంకా తెలంగాణ పాలకుల్లో వలసాంధ్ర పాలకుల ఆలోచనలు మాత్రం వదిలిపెట్టడం లేదు. సీమాంధ్ర పార్టీల బానిసత్వం నుంచి బయటపడటం లేదు.
దీంతో తెలంగాణపై మళ్లీ సమైక్యవాదులు విషం చిమ్ముతున్నారు.కాల నాగుల్లా తెలంగాణ తెలంగాణపై విరుచుకుపడుతున్నారు. దశాబ్దకాలం కుక్కిన పేనులా ఉన్న వలసాంధ్రవాదులు రెండేళ్లుగా రెచ్చిపోతున్నారు. పచ్చబడ్డ తెలంగాణపై మిడదల దండులా పడేందుకు కోరలు చాస్తున్నారు. తెలంగాణపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నారు. తెలంగాణ అస్తిత్వం లేదు, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లేదంటూ దాడులు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరుల త్యాగాలను ఉద్దేశ్య పూర్వకంగానే కించర్చుతున్నారు.
కాంగ్రెస్‌ అసమర్థ పాలన, రేవంత్‌ రెడ్డి లాబీయింగ్‌ విధానాలతో తెలంగాణపై వలసాంధ్ర విష నాగులు పగడవిప్పుతున్నాయి.తెలంగాణ వ్యతిరేకే తెలంగాణ పాలకుడు కావడంతో, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తే సీఎం కావడంతో ఇక తమకు తిరుగులేదన్నట్లుగా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
 తెలంగాణవాదులపై,ఉద్యమకారుల పై దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున సీమాంధ్ర తాబేదార్లు తెలంగాణవాదులకు సవాల్ విసురుతున్నారు. తల్లి పాలు తాగి తల్లి యదపై తన్నే బ్యాచ్ ను సమైక్యాంధ్ర వాదులు  తయారు చేస్తున్నారు.తన కంటిని మన చేయితో పోడిపించే కుట్రలు చేస్తున్నారు.ఆర్థిక రాజధాని హైదరాబాద్ పై పట్టుకోసం, తెలంగాణపై ఆధిపత్యం కోసం సీమాంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారు.
పాలన సలహాదారులుగా తెలంగాణ వాళ్లు ఉంటే తెలంగాణ సోయితో పని చేస్తారు.తెలంగాణ ఆత్మతో సలహాలు ఇస్తారు.మరీ మొత్తం సీమాంధ్రులనే సీఎం సలహాలుగా పెట్టుకుంటే వారు తెలంగాణ సోయితో తెలంగాణ కోసం తెలంగాణ ఆత్మతో సలహాలు ఇస్తారా.?తెలంగాణపై పర్మినెంట్ రాజకీయ  ఆర్థికాధిపత్యం లేకపోతే యూటీ కుట్రలు చేసే విధంగా వారి సలహాలుంటాయి.
తెలంగాణ సంస్కృతిపై సీమాంధ్ర సంస్కృతిని రేవంత్‌ రెడ్డి ముందు పెట్టి రుద్దుతున్నాయి.తెలంగాణ ధిక్కార స్వరాలను పక్కనబెట్టి సమైక్యవాదుల విగ్రహాలతో తెలంగాణ అస్తిఆత్మగౌరవంపై సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా చేస్తున్నారు. .తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించే జాతీయ పార్టీలతో భాగస్వామ్యమై తెలంగాణ అస్తిత్వంపై దాడికి సిద్దమైతున్నాయి. రేవంత్‌ రెడ్డిని ఆయుధంగా మార్చుకుని జాతీయ పార్టీలు, సీమాంధ్ర పార్టీల వ్యూహాలు రచిస్తున్నాయి.
.చంద్రబాబును డైరెక్ట్ గా తెలంగాణ రాజకీయాల్లో  దింపకుండా బీజేపీ పవన్ ను రంగంలోకి దింపుతుంది. చంద్రబాబును రంగంలోకి దింపితే తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేక వస్తుందని జనసేన పేరుతో పవన్‌ను రంగంలోకి దించుతుంది.రాష్ట్రంలో జనసేన పార్టీకి బలం లేకున్నా  తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే వ్యూహాన్ని బలోపేతం చేస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం రేవంత్, పవన్ తో బీజేపీ ప్లాన్ చేసింది. గ్రేటర్ పై పట్టుకోసం పవన్, టీడీపీ, బీజేపీ కలిసి రేవంత్‌ రెడ్డితో వ్యూహాలు అమలు చేస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో వోట్ల పోలరైజ్ చేస్తూ సీట్ల కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుతుంది.ఒకవైపు సీమాంధ్రుల వోట్ల కోసం తెలంగాణ వ్యతిరేకుల విగ్రహాలు తెలంగాణ వీపుపై రాచపుండులా ఏర్పాటు చేస్తున్నారు..తద్వారా గేటర్ పై పట్టునిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అండతో, రేవంత్‌ మద్దతుతో సీమాంధ్ర పార్టీలు తెలంగాణలో రెచ్చిపోతున్నారు.
ఒకవైపు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న మోదీ , తెలంగాణ వస్తే పస్తులున్న పవన్‌ కల్యాణ్‌, తెలంగాణ ఏర్పాటును పాక్‌ ఇండియా బీజేపీ ఎంపీలు పోల్చడం, తెలంగాణ ఉద్యమాన్ని కలిస్తాన్‌ ఉగ్రవాదంతో పవన్ పోల్చడం, టీడీపీ నేత తెలంగాణ పదం డిక్షనరీలో లేదని చెప్పడం ఈ తెలంగాణ వ్యతిరేకులంతా కూటమిగా జట్టుకట్టి తెలంగాణపై దాడి చేస్తున్నారు.ఒకవైపు తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకిస్తూనే మరోవైపు  తెలంగాణ ప్రజలను, తెలంగాణ వాదులను రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తున్నారు.తెలంగాణవాదం లేదు,తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం లేదంటూ తమ తాబేదార్లలతో తెలంగాణలో ప్రాపగండా చేయిస్తున్నారు..తెలంగాణ నినాదాన్ని కనుమరుగు చేసే కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ వాదులను ఉద్దేశ్యపూర్వకంగానే సీమాంధ్ర పార్టీ నేతలు  రెచ్చగొట్టుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వాదులపై సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారు. ఏకంగా జనసేన కార్యకర్తలు తెలంగాణ వాదులపై భౌతిక దాడులు చేస్తామంటే ప్రెస్‌ క్లబ్‌ సాక్షిగా బెదిరిస్తున్నారు.
రెండున్నర కాంగ్రెస్ పాలనలో తెలంగాణవాదం,తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం ప్రమాదంలో పడ్డది..తెలంగాణ ఉద్యమకారుల ఉనికిని ప్రశ్నార్ధకంగా మార్చేందుకు దాడులు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. సీమాంధ్రుల విగ్రహాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ అస్తిత్వంపై రేవంత్ దాడి చేస్తుంటే, తెలంగాణ ఆత్మగౌరవంపై సమైక్యాంధ్ర పార్టీల దాడులు చేస్తున్నాయి. తెలంగాణ వస్తే ఏ సబ్బండ వర్గాలకు అభివృద్ది సంక్షేమ ఫలాలు అందుతాయోనని యువత త్యాగాలకు సిద్దపడ్డారో ఉద్యమ,అమరుల త్యాగాలతో ఏర్పాడిన తెలంగాణలో ఫలాలు ప్రజలకు అందలేదు.వెరసి గత రెండున్నరేళ్లలో కాంగ్రెస్  పాలనాలో తెలంగాణ నష్టపోయింది.మరీ ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ నష్టపోయింది విద్యార్థి నిరుద్యోగులు, పించన్లు దారులు, రైతులు, ఉద్యోగులే. ఆయా వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ అమలు చేయలేదు.
రెండున్నర ఏళ్ళు దాటిన ఉద్యమకారులు ఇంకా  గుర్తింపుకు నోచుకోలేదు. కమిటీల పేరుతో కాలయాపన తప్ప ఒక్క అడుగు ముందు పడలేదు. ఈ జూన్‌2న ఆర్టీసీ ఉద్యోగులును ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఉద్యమకారులను గుర్తిస్తామన్నారు.ఎన్నికల పేరుతో ఆర్టీసీ కార్మికులను, కమిటీల పేరుతో ఉద్యమకారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ధోకా చేసింది. తెలంగాణకు నష్టం జరుగుతుంటే ప్రశ్నిస్తున్న తెలంగాణవాదులపై సీమాంధ్ర పాలకుల తాబేదార్లు దాడులు చేస్తున్నారు. తెలంగాణ వాదానికి సమాధి కట్టుతు సీమాంధ్రుల విగ్రహాలకు పట్టం కట్టుతూ తెలంగాణ చరిత్రకు ఘోరి కట్టుతున్నారు.
.తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇక తెలంగాణవాదం లేదు.. తెలంగాణలో ప్రాంతీయ పోరాటాలు అవసరం లేదని సీమాంధ్ర పాలకులు ప్రచారం చేసిన ప్రతీసారీ తెలంగాణవాదాన్ని పదేపదే సీమాంధ్ర పాలకులు తట్టిలేపుతున్నారు. వాళ్ళ స్వప్రయోజనాలు, స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టుతున్నా అది తెలంగాణ సమాజాన్ని పదేపదే ఐక్యం చేస్తుంది. తెలంగాణపై ఆ పార్టీలు కుట్రలు చేస్తున్న అది తెలంగాణకే లాభం చేస్తుంది.
మలిదశ తెలంగాణ ఉద్యమం ఆరు దశాబ్దాలుగా విడిపోయిన అచైతన్యంలో ఉన్న ప్రజలను ఐక్యం చేసి చైతన్య పర్చింది. తెలంగాణ వచ్చిన ప్రజలు పార్టీలు సంఘాల పేరుతో విడిపోయారు.కానీ చైతన్యం విడిచిపెట్టలేదు. దాదాపు 12 ఏళ్ళ పాటు ప్రజల మధ్య ఐక్యత లోపించిన చైతన్యం మాత్రం పోలేదు. ఇప్పుడు మళ్ళీ సీమాంధ్ర పార్టీలు  చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేస్తున్నాయి. మళ్ళీ తెలంగాణ సమాజంలో పోరాట స్ఫూర్తిని, ప్రాంతీయ ఐక్యతను పెంచుతుంది. తెలంగాణవాద సెంటిమెంట్ ను రగిలిస్తుంది. పార్టీలు, సంఘాలుగా విడిపోయిన తెలంగాణను తిరిగి ఐక్యం చేస్తున్న సీమాంధ్ర పార్టీలకు, వాటికి తెలంగాణలో తాబేదార్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ ద్రోహులకు కృతజ్ఞతలు.
సమైక్యవాదులు తెలంగాణలో కుట్రలు చేస్తునే ఉండాలి, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఉద్యమకారులపై అవాకులు చెవాకులు పేలుతూనే ఉండాలి, ఆ కుట్రలను, ఆ చిల్లర కూతలకు తెలంగాణ సమాజం పదేపదే ఐక్యమవుతూ  ఆ ద్రోహుల కుట్రలు భగ్నం చేస్తూనే ఉండాలి. చిల్లర సైనిక్స్ తెలంగాణ సెంటిమెంట్ ను ఎంత రెచ్చగొట్టితే, తెలంగాణ సమాజం పార్టీలకతీతంగా ఏకమవుతుంది. పార్టీలుగా  ప్రజలు విడిపోవచ్చు కానీ తెలంగాణ వాదులు అందరూ ఐక్యంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి జై తెలంగాణ అంటే ఆ పవిత్ర నినాదం కు  ప్రాంతేతరులు వారి తాబేదార్లు గుండెలదురుతాయి .. !
-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *