హైదరాబాద్ రోడ్డుకు యుద్ధ పిపాసి పేరా..?

“ఒకవైపు ట్రంప్‌పై కాంగ్రెస్ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ పోరాటం చేస్తున్నారు.నరేందర్‌ సరేండర్‌ అంటూ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు.మోదీ దేశాన్ని ట్రంప్‌కు అప్పగించారని, భారత దేశాన్ని ట్రంప్ శాసిస్తున్నారని రాహుల్‌ గాంధీ ట్రంప్‌, మోదీ బంధంపై నిప్పులు చేరుగుతున్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో రోడ్‌కు ట్రంప్‌ పేరు పెట్టుతున్నారు.‌ ఇది కాంగ్రెస్ ద్వంద నీతి కాదా..?”

ఒక వ్యక్తి ఆలోచనలో ఎలా ఉంటుందో ప్రపంచం వ్యాప్తంగా తన ఆలోచనలకు దగ్గరున్న వ్యక్తులు ఆదర్శమైతారు, వారిని స్పూర్తి తీసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హిట్లర్‌ లోని నియంతృత్వ, ట్రంప్‌ లోని విధ్వంసపు ఆలోచనలున్నాయి కాబట్టే సీఎంకు వారు ఆదర్శంగా కనిపిస్తున్నారు. హిట్లర్‌ను, ట్రంప్‌ను స్పూర్తిగా తీసుకుంటున్నారు. నియంత హిట్లర్‌ తనుకు ఆదర్శమన్నారు. హిట్లర్‌ స్పూర్తితోనే హైడ్రా ఏర్పాటు చేనని సీఎం రేవంత్‌ రెడ్డి బహిరంగగానే ప్రకటించారు. ప్రజలను వేధించడం, పేదల ఇళ్లు కూల్చడం, ఎలాంటి ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్పూర్తి లేకుండా న్యాయవ్యవస్థను లెక్క చేయకపోడమే హైడ్రా విధానమని అది హిట్లర్‌ స్పూర్తితో ఏర్పాటు చేశానని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.
తాజాగా ప్రపంచంలో రెండో నియంత, ప్రపంచ విధ్వంసకారుడు, యుద్ధ పిపాసి, యుద్ధోత్సాహంతో ఊగిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి ఆదర్శమైనట్లున్నారు. ఏకంగా హైదరాబాద్‌లో ఒక ప్రాంతానికి, రోడ్డుకు ట్రంప్‌ పేరు పెట్టేందుకు రేవంత్‌ రెడ్డి ఉవ్విళ్లుతున్నారు.హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ వెళ్లే రహదారికి డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూ అని రేవంత్‌ సర్కార్‌ పేరు పెట్టింది.
హైదరాబాద్‌కు ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదు. ట్రంప్‌కు భారత్‌ దేశానికి సంబంధం లేదు..ట్రంప్‌ ఒక ఆధినిక కాలపు నయా నియంత.సామ్రాజ్యవాది. యుద్దోన్మాది. యుద్ద పిపాసి.జాత్యంహకారి.భారత్‌ వ్యతిరేకి. ప్రపంచ విధ్వంసకారుడు. హైద్రాబాద్‌, భారత ఎగుమతులపై ఆంక్షలు పెట్టిన వ్యక్తి. భారతీయులను మెడలుపట్టి తరిమేసిన అమెరికా నుంచి వెళ్లగొట్టుతున్న  ట్రంప్‌. భారతీయుల చేతులకు కాళ్లకు సంకేళ్లు వేసి నేరాస్తుల్లా భారత్‌కు తరలించి భారత్‌ను అవమానించారు.
ఇజ్రాయెల్‌  ఇరాన్‌ యుద్దం, ఉక్రెయిన్‌ రష్యా వార్‌ మాత్రమే కాదు ఇండియా పాక్‌, భారత్‌ చైనా సహ భారత్‌  సరిహద్దు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, మత మారణహోమం సృష్టిస్తుంచే కుట్రదారుడు ట్రంప్‌. ట్రంప్‌ వల్ల ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మూడు నాలుగు వందల యుద్దాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్‌ ఇరాన్‌, ఇజ్రాయెల్ పాలస్తీనా, గాజా విధ్వంసం. ఉక్రెయిన్‌ రష్యా మాత్రం నిత్యం మీడియాలో ఉన్న మీడియాలో లేని ట్రంప్‌ సృష్టించిన అనేక యుద్దాలు పలు దేశాల మధ్య జరుగుతున్నాయి. ప్రపంచ విశనానికి ట్రంప్‌ పాల్పడుతున్నారు. దేశాల మధ్య యుద్దాలు సృష్టిస్తూ ఆయుధ వ్యాపారం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. బాంబులతో దేశాలను నేల మట్టం చేస్తున్నారు. మానవ, ప్రకృతి విధ్వంసానికి. జాతీ మారణహోమానికి పూనుకున్నారు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆదర్శమూర్తిగా కనిస్తున్నారు. అటు హిట్లర్‌ ఇటు ట్రంప్‌ ను సీఎం స్పూర్తిగా తీసుకున్నట్లున్నారు.రేవంత్‌ రెడ్డి ఆలోచనలు హిట్లర్‌, ట్రంప్ ఆలోచనలకు దగ్గరగా ఉన్నట్లున్నాయి అందుకే పదేపదే వారి నామస్మరణ చేస్తున్నారు.తెలంగాణలో వారిని ఆదర్శంగా తీసుకున్నానన్ని చెపుతున్నారు. ట్రంప్‌ విధ్వంసం, హిట్లర్‌ నియంత పోకడలు రేవంత్‌ స్పూర్తిగా తీసుకున్నట్లున్నారు. అందుకే తెలంగాణలో రోడ్లుకు ట్రంప్‌ పేరు పెట్టుతున్నారు. హిట్లర్‌ స్పూర్తితో హైడ్రా పేరుతో విధ్వంసం చేస్తున్నారు.
హిట్లర్‌ స్పూర్తిలో హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టిస్తూ కూలిన శిథిలాల కింద పేదల బతుకులు, భవిష్యత్‌ తరాల జీవితాలను రేవంత్‌ రెడ్డి సమాధి చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ వెనుకుండి ఇరాన్‌, గాజా, పాలస్తీనాలో ట్రంప్ సృష్టిస్తున్న యుద్ద విధ్వంసాన్ని తాను హైడ్రాబాద్‌లో సృష్టిస్తున్నట్లు రేవంత్‌ స్వయంగా ఒప్పుకున్నారు. నియంతకు, విధ్వంసకారుడికి యుద్ద పిపాసలు, నియంతలే ఆదర్శమౌతారు.అందుకే తెలంగాణ ముఖ్యమంత్రికి హిట్లర్‌, ట్రంప్‌ ఆదర్శమయ్యారు.
తెలంగాణలో రెండున్నరేళ్లుగా పాలన లేదు అభివృద్ధి, సంక్షేమం లేదు. 420 హామీల అమలు లేదు,ఆరు గ్యారంటీ అమలు లేదు. డిక్లరేషన్‌ల ఊసే లేదు..ఉన్నదల్లా హిట్లర్‌ స్పూర్తితో ఏర్పాటు చేసిన బుల్డోజర్‌ హైడ్రా పాలన, ట్రంప్‌ ఆదర్శంతో విధ్వంస పాలన మాత్రమే.
.హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ ప్రధాన రహదారికి ట్రంప్‌ పేరు పెట్టాలను కోవడం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌ రెడ్డి చేస్తున్న చారిత్రాత్మక తప్పిదం..తెలంగాణ ప్రజలు అమెరికా యుద్దోన్మాది పేరు హైద్రాబాద్‌లో పెట్టాలని కోరుకోలేదు.కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా సంబంధం లేని వ్యక్తుల పేర్లు హైద్రాబాద్‌ రోడ్లకు పెట్టుకుంటూ ఏదో గొప్ప పని చేసినట్లు కాంగ్రెస్‌, రేవంత్‌ రెడ్డి గప్పాలు కొట్టుకుంటుంది.
తెలంగాణలో అందులో హైదరాబాద్ లో జాతి హననం చేస్తున్న ట్రంప్ పేరు ఎందుకు.?. ఎవరు పెట్టమన్నారు. హైద్రాబాద్‌కు ట్రంప్‌కు ఏం సంబంధం. ట్రంప్‌ ఏమైనా ప్రపంచ శాంతికామకుడా.?  యుద్దోన్మాది  పేరు తెలంగాణలో అందులోనూ గంగా జమునా తెహజీబ్ మతసామరస్యానికి ప్రతీక అయిన హైద్రాబాద్‌లో పెట్టడంలో రేవంత్‌ రెడ్డి ఉద్దేశ్యం ఏంటీ.?.ట్రంప్‌ యుద్దాల పేరుతో అమెరికా ఫస్ట్‌ పేరుతో మన దేశాన్ని, మన ప్రజలను అనేక రకాలుగా వేధిస్తున్నాడు.పన్నులు, టారీఫ్ లు, ఆకాంక్షలు,కండిషన్ల పేరుతో భారతీయుల నడ్డీ విరుసున్నారు.
ట్రంప్‌ ఏమైనా తెలంగాణవాడా..తెలంగాణ ఉద్యమంలో పాల్గొని త్యాగాలు ఏమైనా చేశారా.?తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జాతిని ఏమైనా గౌరవిస్తారా.?.లేదా తెలంగాణ కోసం ట్రంప్‌ తన దేశంలో ఏమైనా ప్రత్యేక పథకాలు, రాయితీలు ఇస్తున్నారా.?.తెలంగాణను ఎగుమతులు, హైద్రాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతుల విషయంలో ట్రంప్‌ తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చారా.?.వెరసి తెలంగాణ ఎగుమతులు, ఐటీ ఉత్పత్తులపై ఆంక్షలు విధించారు.అలాంటి వ్యక్తి పేరు హైదరాబాద్ రోడ్లకు ఎలా పెట్టుతారు.?
పోనీ తెలంగాణ దేశం కాదు కాబట్టి ప్రత్యకంగా ఏమీ చేయలేదు అనుకుందాం.మరీ మన దేశానికి ట్రంప్‌ ఏమైనా చేశారా.? భారతీయకులకు ఏమైనా రాయితీలు, వీసా నిబంధనలో మినహింపులు, ఎగుమతులు, దిగుమతులపై రాయితీలు, పన్ను మినహాయింపులు ఇచ్చాడా.? లేదు కదా. ట్రంప్ ఏమైనా భారతీయుడా. దేశ స్వాతంత్య్రం కోసం దేశ ప్రజల కోసం చివరికి తెలంగాణ కోసం ఏం చేశారు.?.మరీ ట్రంప్‌ పేరు హైదరాబాద్ రోడ్దుకెందుకు పెట్టాలి.?
.తెలంగాణలో ఉద్యమకారులు లేరా .?.దేశం కోసం త్యాగాలు చేసిన నేతలు లేరా.?.తెలంగాణ కోసం ఆజన్మాంతం త్యాగాలు చేసిన వ్యక్తులున్నారు. ప్రాణాలు సైతం తృణపాయంగా వదులుకున్న యువతుంది. తెలంగాణ భూమి కోసం, దేశంలో బడుగు బలహీనుల కోసం ప్రాణాల్పించిన అమరులున్నారు..వారి పేర్లు పెట్టొచ్చు కదా.అయిన ట్రంప్‌ ఏమైనా అమెరికా జీవితకాల అధ్యక్షుడా.?.ట్రంప్‌ పేరు పెట్టితే తెలంగాణకు ఏమైనా అధిక పెట్టుబడులు వస్తాయా..?.తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయా..? .ట్రంప్ భారత్ పై విషం చిమ్ముతున్నారు. మన పౌరులను మెడపట్టి అక్కడి నుంచి గెంటేశారు. మన ఐటి ఫార్మా ఎగుమతులపై ఆంక్షలు విధించారు. అలాంటి ట్రంప్ పేరు హైదరాబాద్లో రోడ్డు కు ఎందుకు పెట్టాలి.?
హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ ఉన్నంత మాత్రాన ట్రంప్ పేరు పెట్టాలా.?.ప్రపంచం మొత్తం పిచ్చొడు అని పిలిచే ట్రంప్ ను తెలంగాణ పై రేవంత్ ఎందుకు రుద్దుతున్నాడు. ట్రంప్ ఏమైనా అమెరికా స్వాతంత్ర్యం  కోసం పోరాటం చేశారా.?. ప్రపంచ నియంతలే ఎందుకు రేవంత్ కు ఆదర్శమైతున్నారు.?.ప్రపంచంలో ఎవ్వరూ హిట్లర్‌ తనకు స్పూర్తి అని ప్రకటించుకోలేదు..ఏ దేశంలో కూడా అమెరికా కాన్సులేట్ రోడ్‌కు ట్రంప్‌ పేరు పెట్టుకోలేదు.
ట్రంప్ పేరు పెడితే పెట్టుబడులు వస్తాయా.?.పోనీ దేశ భక్తి రాష్ట్ర భక్తి ఏమైనా తెలంగాణ ప్రజల్లో పెరుగుతుందా..?. తెలంగాణ చిహ్నంలో రాజరికం కనిపించిన రేవంత్ రెడ్డికి ట్రంప్ లో నియంతృత్వం కనిపించడం లేదా..?..చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళా తోరణం తీసేస్తా అన్న రేవంత్ కు ట్రంపై రోడ్డు ఎందుకు ఆదర్శంగా కనబడుతోంది.?.
ఒకవైపు విదేశీయులు , ముస్లిం పాలకుల పేర్లు వద్దని బీజేపీ దేశంలో రోడ్లు, భవనాలు చివరికి పార్లమెంట్, సీఎంవో పేర్లు మార్చుతుంటే  తెలంగాణ సీఎం రేవంత్  మాత్రం ఎందుకు ట్రంప్ పేరు పెడుతున్నారు.?..ట్రంప్ యుద్ధాలతో ప్రపంచ వ్యాప్తంగా దేశాల్లో విధ్వంసం సృష్టించిస్తే హైడ్రా తో హైదరాబాద్ రేవంత్ విధ్వంసం సృష్టిస్తున్నందుకు అటు హిట్లర్ ఇటు ట్రంప్ ఆదర్శంగా కనిపించారా..?.అందుకే హిట్లర్ స్పూర్తి, ఇరాన్ విధ్వంసం అంటు రేవంత్ పోల్చారా..?.
అంతేకాదు హైదరాబాద్‌లో రోడ్‌కు ట్రంప్ పేరు పెట్టడం కాంగ్రెస్‌ పార్టీ విధానామా.? లేక రేవంత్ రెడ్డి వ్యక్తిగత నిర్ణయమా కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేశాలి..ఎందుకు హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టాలని కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుందో తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి.
ఒకవైపు ట్రంప్‌పై కాంగ్రెస్ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ పోరాటం చేస్తున్నారు.నరేందర్‌ సరేండర్‌ అంటూ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు.మోదీ  దేశాన్ని ట్రంప్‌కు అప్పగించారని, భారత దేశాన్ని ట్రంప్ శాసిస్తున్నారని రాహుల్‌ గాంధీ ట్రంప్‌, మోదీ  బంధంపై నిప్పులు చేరుగుతున్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో రోడ్‌కు ట్రంప్‌ పేరు పెట్టుతున్నారు.‌ ఇది కాంగ్రెస్ ద్వంద నీతి కాదా..?
తెలంగాణలో నుడుస్తుంది కాంగ్రెస్ ప్రజా పాలన కాదు..ట్రంప్‌, హిట్లర్ పాలన. ప్రపంచం మొత్తం వ్యతిరేకించే నేతలను ఆదర్శంగా తీసుకున్న ట్రంప్, హిట్లర్‌ ల కలయిక నేతల పాలన నడుస్తుంది. ట్రంప్‌ విధ్వంసం, హిట్లర్‌ నియంత పాలన తెలంగాణలో కాంగ్రెస్ చేస్తుంది. ట్రంప్‌ యుద్దోన్మాద విధ్వంసం, హిట్లర్‌ అణచివేతల పాలన తెలంగాణలో నడుస్తుంది. తెలంగాణలో జాతి విధ్వంసకుడి, జాతి హననంతో మారణహోమం సృష్టిస్తూ నరమేరధ యాగం చేస్తున్న ట్రంప్‌ పేరు పెట్టడం వినాశకర బుద్దే. హిట్లర్‌ ,ట్రంప్‌ విధానాలను దేశం ఆవల పాతిపెట్టాలి. వారిని ఆదర్శంగా తీసుకుని వారి స్పూర్తితో పాలన చేస్తున్న పాలకులను ప్రాంతంలో రాజకీయ సమాధి కట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *