ఉద్యమకారుల గుర్తింపా? అగౌరవమా? చరిత్ర తారుమారా?

“తెలంగాణ ఉద్యమం ఎంత విస్తారమైనదంటే జనాభాలో సగం, కనీసం మూడో వంతు అయినా ఆ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. అంటే కనీస పక్షం ఒక కోటి మంది ఉద్యమకారులు తేలుతారు. అంత భారీ సంఖ్య మొత్తాన్నీ ఎట్లా గుర్తిస్తారు? ఏ సత్కారంతో గౌరవిస్తారు? కనీస నగదు పారితోషికం ఇవ్వాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి?…

