Take a fresh look at your lifestyle.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

యూరోపియన్‌ ‌బిజినెస్‌ ‌గ్రూప్‌ ‌ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు రాయబారులు, పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు  పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన అవకాశాలు ఉన్నాయని, టీఎస్‌ ఐపాస్‌ ‌ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పామని కేటీఆర్‌ ‌వివరించారు. పెట్టుబడి అవకాశాలను తెలంగాణకు అనుకూలంగా మలిచేందుకు.. ఆయా దేశాల్లోని పారిశ్రామిక వర్గాలతో సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. ఇందుకు వివిధ దేశాల రాయబారుల సహాయాన్ని కేటీఆర్‌ ‌కోరారు. ఈ కార్యక్రమంలో ఐటి సెక్రటరీ జయేశ్‌ ‌రంజన్‌ ‌తదితరులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply