హాస్టల్‌లో ఇంటర్‌ ‌విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే13 :  ‌మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ‌కాలేజీలో ఇంటర్‌ ‌విద్యార్థిని పూజారెడ్డి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. కాలేజీ హాస్టల్‌లో విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కోదాడకు చెందిన పూజారెడ్డి మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ‌కాలేజీలో ఇంటర్‌ ‌చదువుతోంది. ఇంటర్మీడియట్‌ ‌మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని బెటర్మెంట్‌ ‌కోసం పరీక్షకు అప్లై చేసుకుంది. బుధవారం నుంచి బెటర్మెంట్‌ ‌పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా రాత్రి హాస్టల్‌లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థుల గమనించి వెంటనే హాస్టల్‌ ‌వార్డెన్‌కు తెలియజేశారు. విద్యార్థిని ఆత్మహత్యపై హాస్టల్‌ ‌సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పరీక్షల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ బిడ్డ ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *