ప్రేమ, పెళ్లి పేరుతో మోసం

– మహిళా కానిస్టేబుల్‌ను వంచించిన ఎస్ఐ
– కొల్లూరు ఎస్ఐ సురేశ్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు 

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో ఓ ఎస్సై మోసం చేసిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్ అయిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమిస్తున్నాను అంటూ నమ్మించి పెళ్లి పేరుతో కాలయాపన చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కొల్లూరు ఎస్సై సురేష్ కుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 2018 బ్యాచ్ ఎస్సై సురేష్ కుమార్‌కు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యువతితో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆయనకు దగ్గరైంది. కొన్నాళ్లుగా పెళ్లి విషయంపై ఒత్తిడి చేస్తుండగా ఎస్సై సాకులు చెబుతూ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది కూడా. వెంటనే పెళ్లి చేసుకోవాలని మహిళా కానిస్టేబుల్ పట్టుబట్టడంతో పెళ్లి చేసుకునేది లేదని, పెళ్లి చేసుకోవటం కుదరదని ఆయన తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినట్లు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఆ కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్సై సురేష్‌ను విచారించేందుకు ప్రయత్నించారు. అతని సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉండటం, విచారణకు స్పందించకపోవటం, అందుబాటులో లేకపోవటం వంటి కారణాలతో ఎస్సై సురేష్ కుమార్‌ను శారు. బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *