– ఇంటర్ బోర్డు అనూహ్య నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్‌పై ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సర్క్యులర్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు టీజీబీఐఈ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదిత సంస్కరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామని బోర్డు ప్రకటించింది. అన్ని జూనియర్ కాలేజీలకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది. ఈనెల 4న ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన సర్క్యులర్‌ను టీజీబీఐఈ జారీ చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





