హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11: ఇంటర్ బోర్డు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలపై విద్యార్థులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీ డియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థుల మార్కుల మెమోలను వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్‌ల ద్వారా చూసుకోవచ్చు. మే 13 నుంచి 21 వరకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 889 పరీక్షా కేంద్రాలలో 3,98,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. 17 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలలో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిచేసిన బోర్డు సకాలంలో ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



