– రూ.5వేల కోట్ల భారీ కుట్ర భగ్నం : సిపి సజ్జన్నార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్11: గతంలో నిషేధానికి గురైన క్యూనెట్ సంస్థ సరికొత్తగా ఇగ్నైట్ పేరుతో అవతారమెత్తిందని సీపీ సజ్జనర్ తెలిపారు. ఆ సంస్థ చేయాలనుకున్న దాదాపు రూ.5వేల కోట్ల భారీ మోసం కుట్రను భగ్నం చేసినట్లు ఆయన వెల్లడించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడారు. ఈ అంతర్జాతీయ నెట్‌వర్క్ గత 25 ఏళ్లుగా ‘గోల్డ్ క్వెస్ట్’, ‘క్వెస్ట్ నెట్’ ‘క్యూనెట్’.. ప్రస్తుతం ‘ఇగ్నైట్’గా పేరు మార్చుకుని అమాయకులను దోచుకుందని సీపీ వివరించారు. దేశంలో లక్షల్లో బాధితులున్నారని తెలిపారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మామిడిపండ్లు తిని అక్కాచెల్లెళ్లు చనిపోయిన ఘటనపై సీసీ సజ్జనర్ స్పందించారు. బాలికల అంతర్గత అవయవాల నమూనాలు భద్రపరచాలని ఆదేశించామని.. వైద్య నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని చెప్పారు. బాలికల మరణాలకు కారణాలు కనుగొంటామన్నారు. నారాయణగూడ పీఎస్ పరిధి విఠల్‌వాడిలో ఇద్దరు బాలికలు మృతిచెందిన విషయం తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

