23వేల పాఠ‌శాల మూసివేత త‌గ‌దు

– తెలంగాణ సేవ్ ఎడ్యుకేష‌న్ క‌మిటీ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12: పాఠ‌శాల‌ల‌ను 27వేల‌నుంచి 4వేల‌కు త‌గ్గిస్తామ‌ని ఇటీవల హిందూ దిన‌ప‌త్రిక నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాన్ని తెలంగాణ సేవ్ ఎడ్యుకేష‌న్ క‌మిటీ నిర‌సించింది. దీనివ‌ల్ల అట్ట‌డుగు వ‌ర్గాల‌కు విద్య‌నందించే 23వేల పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌తాయి.. బ‌డిమానేసే పిల్ల‌ల సంఖ్య పెరుగుతుంద‌ని క‌మిటీ ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. విద్యాహ‌క్కు చ‌ట్టం 2009 క్లాజు 5 (1) (ఎ) (బి) ప్ర‌కారం 5వ త‌ర‌గ‌తి లోపు విద్యార్థుల‌కు ఒక కిలోమీట‌రు లోపు, ఆపై త‌ర‌గ‌తులు చ‌దివే విద్యార్థుల‌కు 3 కిలోమీట‌ర్ల లోపు పాఠ‌శాల స‌దుపాయం క‌ల్పించాలి. ఈ నేప‌థ్యంలో 23వేల పాఠ‌శాల‌ల‌ను మూసివేయాల‌న్న ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని క‌మిటీ డిమాండ్ చేసింది. ఈమేర‌కు ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తెచ్చేందుకు శ‌నివారం సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించనున్న‌ట్టు క‌మిటీ స‌భ్యులు తెలిపారు. ప్రొఫెస‌ర్ మాడ‌భూషి శ్రీ‌ధ‌ర్‌, ప్రొఫెస‌ర్‌ డి.న‌ర‌సింహారెడ్డి,  ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌, నెల్లికంటి స‌త్యం, జూల‌కంటి రంగారెడ్డి, ప్రొఫెస‌ర్ రామా మెల్కొటే త‌దిత‌రులు పాల్గొంటార‌ని, క‌మిటీ అధ్య‌క్షులు ప్రొ. చ‌క్ర‌ధ‌ర‌రావు, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ ప్రొ. కె.ల‌క్ష్మీనారాయ‌ణ‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రొ.హ‌ర‌గోపాల్‌లు వెల్ల‌డించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *