రసాయన పరిశ్రమలో ప్రమాదం

– ముగ్గురు యువకుల దుర్మరణం
– ఒకరు నారాయణపేట జిల్లా వ్యక్తిగా గుర్తింపు

రాయచూర్, ఆగస్ట్ 5: కర్ణాటక యాద్గిర్ జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ యువకుడు సహ ముగ్గురు యువకులు మరణించారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరి స్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి 2 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని విష వాయువులు లీకవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన ఐదుగురిని రిమ్స్ కు తరలించారు. అయితే అప్పటికే ముగ్గురు మృతిచెందారు. మృతులను నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణెళ్ళి, మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాకు చెందిన విక్రమ్, సంజయ్ లుగా గుర్తించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *