హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ను తొలగించాలి

– వెలువ‌డిన‌ హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31 :హైడ్రా- శాంతా శ్రీరాం కన్‌‌స్ట్రక్షన్‌ ‌కంపెనీ కేసులో హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ను తప్పించాలన్న‌హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. లోతుకుంట భూముల వ్యవహారంలో ఇటీవల ఉన్నత న్యాయస్థానం విచారణ జరపగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఆయ‌న‌ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాలంటూ సీఎస్‌ను హైకోర్టు కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. హైడ్రా కమిషనర్‌ ‌కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్నది సుస్పష్టమని హైకోర్టు అందులో పేర్కొంది. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్టవిరుద్ధమని తెలిపింది. రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సీఎస్‌కు సూచించింది. టాటా మోహన్‌రావు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈ సందర్భంగా ఉదహరించింది. చట్టపాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *