ప్రియుడితో కలసి భర్త హత్య

– భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు
– గుట్టురట్టు చేసిన మియాపూర్‌ ‌పోలీసులు
– మహారాష్ట్ర సరిహద్దులో శవాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తింపు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 7: ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య, ఏ తెలియదన్నట్లుగా మిస్సింగ్‌ ‌కేసు పెట్టింది. భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నగరంలోని మియాపూర్‌లో ఈ దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య అత్యంత కిరాతంగా హత్య చేసింది. ఆ తరువాత భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్‌ ‌కేసుగా నమోదు చేసిన మియాపూర్‌ ‌పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఏడు నెలల తర్వాత ఈ కేసులో భార్యే హంతకురాలిగా పోలీసులు తేల్చారు. భర్తను భార్యే హత్య చేసి ఆపై కనిపించడం లేదంటూ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా భార్య కాల్‌ ‌రికార్డుల‌ను, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు. భర్తను చంపి మృతదేహాన్ని మహారాష్ట్ర బోర్డర్‌ ‌వరకు తరలించి పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు పెంటేష్‌(45)‌గా గుర్తించారు. తన ప్రేమ వ్యవహారానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో భార్య అంగీకరించింది. ప్రస్తుతం నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రియుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *