– 40మంది ప్రయాణికుల దుర్మరణం
ఇస్లామాబాద్, జూలై 3 : పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ బలూచిస్థాన్ రాష్ట్రంలో షేరానీ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న షేరానీ జిల్లా ఉన్నతాధికారులు, వైద్యులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం ఝోబ్‌లోని ట్రామా సెంటర్‌కు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. ఇటీవల జరిగిన అత్యంత ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఇదీ కూడా ఒకటని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపంతో ఓ బస్సు ఆగిపోయిందని, దీంతో అందులోని ప్రయాణికులను కూడా ఈ బస్సులోకి ఎక్కించారని అధికారులు చెప్పారు. దీంతో బస్సు ప్రయాణికులతో నిండిపోయిందన్నారు. ఈ ప్రమాదం జరిగిన బస్సు.. 36 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి బయలుదేరిందని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభమైందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




