హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 4: అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల పసికందును తల్లిదండ్రులు నిర్దయగా వదిలేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన నగరంలోని నాంపల్లి నీలోఫర్ హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన దంపతులు తమ ఆరు రోజుల మగ శిశువును హాస్పిటల్‌లో చేర్చారు. శిశువు శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నాడు. ఏప్రిల్ 25న శిశువును నీలోఫర్‌లో చేర్చిన తల్లిదండ్రులు అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. పసికందుకు సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పసికందును నీలోఫర్ హాస్పిటల్ వైద్యులు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఎన్‌బీసీయూలో చికిత్స అందించి.. శిశువును కాపాడారు. ఆసుపత్రి ఆర్‌ఎంఓ ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పసికందును సంరక్షణ కోసం శిశు విహార్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శిశువు తల్లిదండ్రులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



