బావిలో పడ్డ ఎద్దును రక్షించబోయి మృత్యువాత

– ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు దుర్మరణం

భోపాల్‌,‌ జులై 4: బావిలో పడిన ఎద్దును రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌ ‌లోని సత్నా జిల్లాలో చోలుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖరమ్‌సేడ గ్రామంలో శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఓ ఎద్దు ప్రమాదవశాత్తు బావిలో పడింది. దానిని రక్షించడానికి ఇద్దరు వ్యక్తులు తాడు సాయంతో 40 అడుగుల బావిలోకి దిగారు. వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మరో ఇద్దరు బావిలోకి దిగారు. కొన్ని నిమిషాల తర్వాత వారు కూడా తిరిగిరాలేదు. దీంతో లోపల ఏదో ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన స్థానికులు తాళ్లు, కొక్కాల సాయంతో 3 గంటల పాటు శ్రమించి నలుగురిని బయటకు తీశారు. వెంటనే వారిని హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన రాహుల్‌ ‌యాదవ్‌ (36), ‌వీరేంద్ర యాదవ్‌ (40), ‌కృష్ణదత్‌ ‌యాదవ్‌ (26)‌గా గుర్తించారు. చాలాకాలం పాటు బావి మూసి ఉండడంతో భారీగా చెత్త పేరుకుపోయిందని.. విషవాయువులు వెలువడి అందులోకి దిగినవారు మృతిచెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *