– యువతితో కలిసి వచ్చిన ఫారూఖ్ అనే వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: నగరంలోని లంగర్‌హౌస్ పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని రేణుక(26)గా పోలీసులు గుర్తించారు. లాడ్జ్‌లో యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్లు తెలిపారు. ఫారూఖ్ అనే వ్యక్తితో కలిసి రేణుక హోటల్‌లో గది బుక్ చేసుకుంది. అనంతరం ఫారూఖ్ బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రేణుక ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. లంగర్‌హౌస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతిది హత్యా, ఆత్మహత్యా అనే దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వహాస్పిటల్‌కి తరలించారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, తమ కుమార్తెను హత్య చేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్వాల్‌కు చెందిన రేణుకకు గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారుక్ (34)తో పరిచయం ఉంది. ఈ క్రమంలో ఇద్దరూ నిన్న రాత్రి హోటల్‌లో గదిని బుక్ చేసుకున్నారు. తాను కొద్దిసేపు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రేణుక ఉరివేసుకుని కనిపించిందని ఫారుక్ పోలీసులకు తెలిపాడు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




