విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి భారీ ఆర్థిక భరోసా

– మృతుడి భార్యకు ప్రమాద బీమా చెక్కు అందజేత

హైదరాబాద్, ప్రజాభవన్, జూన్ 3 : ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు లైన్‌మన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ మృతిచెందగా ఆయన సతీమణి స్వప్నకు రూ.కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో బుధవారం అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్‌కు గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం యÖఎసఎసఏ-2, యÖఎసఎసఎ-3 పథకాల కింద సాలరీ ఖాతాలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రూ.కోటి విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్పీడీసీఎల్ బాసర పరిధిలో లైన్‌మన్ ప్రమోద్ కుమార్ 23 సెప్టెంబర్ 2024న బాసర శాఖలో తన యÖఎసఎస్-2 జీతానికి సంబంధించి ఖాతాను ప్రారంభించారు. దురదృష్టవశాత్తు ఆయన గత ఏడాది మార్చి 24న విధి నిర్వహణలో ఉండగా జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆయన అకాల మరణం తర్వాత మృతుని నామినీ అయిన స్వప్న క్లెయిమ్ దరఖాస్తును బాసర శాఖలో సమర్పించారు. ఈ క్రమంలో రూ.కోటి బీమా మొత్తం గత నెల 30న స్వప్న సేవింగ్స్ ఖాతాలో జమ అయింది. ఈ క్లెయిమ్ వేగంగా పరిష్కారం కావడం అనేది ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వానికి, బ్యాంకింగ్ రంగానికి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. అలాగే సాలరీ ప్యాకేజ్ పథకాల కింద అందిస్తున్న బీమా ప్రయోజనాల ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ప్రజాభవన్‌లో జరిగిన చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి, యూనియన్ బ్యాంకు సీఈవో అశిష్ పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేష్ ప్రసాద్, చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, నిజామాబాద్ రీజినల్ హెడ్ అరుణ సవిత, చీఫ్ మేనేజర్ వై.వి.రాఘవ, బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్, తదితర ఉన్నతాధికారులు పాల్గొని బాధిత కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *