హైదారాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 11: జీహెచ్‌ఎంసీ పరిధిలోని అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు భారీగా బకాయిలు పడ్డాయి. ఈ ఏజెన్సీల నుంచి జీహెచ్‌ఎంసీకి సుమారు రూ. 39.74 కోట్లు (ఖచ్చితంగా రూ.39,74,15,778) రావాల్సి ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ సెప్టెంబరు 10న శాసనమండలిలో ఈ వివరాలను సమర్పించింది. ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం హైదరాబాద్ క్యూర్ పరిధిలో మొత్తం 452 ఏజెన్సీ ఎంట్రీలు, 1,521 అడ్వర్టైజ్‌మెంట్ నిట్లకు సంబంధించి ఈ బకాయిలు పేరుకుపోయాయి. బకాయిదారుల జాబితాలో పలు ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా, నియాడ్స్ అనే సంస్థ ఒక్క నిట్‌కే అత్యధికంగా రూ. 7.71 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఐ క్యాచ్ కవ్యనికేషన్స్ మరో నిట్‌కు సంబంధించి రూ. 6.47 కోట్లు బకాయిపడింది. అత్యధిక నిట్లు కలిగిన సంస్థల్లో ప్రకాశ్ ఆర్టస్ ముందు వరుసలో ఉంది. ఈ సంస్థకు చెందిన 53 నిట్లకు గానూ మొత్తం రూ. 5.35 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటితో పాటు మీడియా కార్ప్ రూ. 5.06 కోట్లు, సీఎంఎస్‌ఎస్ రూ. 1.79 కోట్లు, అవుట్‌స్పేస్ అడ్వర్టైజింగ్ రూ. 1.86 కోట్ల చొప్పున బకాయిలు చెల్లించాల్సి ఉంది. అవుట్‌డోర్ ప్రకటనల నియంత్రణ కోసం ప్రభుత్వం ఈ ఏడాది మార్చి, జూన్ నెలల్లో ‘అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీ ఫర్ క్యూర్-2026’ను జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రైవేట్ ఆస్తులపై ప్రదర్శించే ప్రకటనలకు ఆన్‌లైన్ ద్వారా, ప్రభుత్వ ఆస్తులపై ప్రకటనలకు టెండర్ల ద్వారా అనుమతులు మంజూరు చేస్తారు. అయితే, ఫీజుల వసూలుకు సంబంధించి 2020 నాటి మార్గదర్శకాలు ప్రస్తుతం నిలిపివేతలో ఉన్నాయని, త్వరలోనే సమగ్రమైన కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




