రికార్డు ధరకు హౌసింగ్ బోర్డు ప్లాట్లు

కేపీహెచ్‌బిలో గజం భూమి రూ.2.70 లక్షలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్ 2 : కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బి) కాలనీలోని ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలంలో మరోసారి భారీ ధర పలికిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. బుధవారం నిర్వహించిన వేలం పాటలో కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు సంబంధించి గరిష్టంగా చదరపు గజం భూమి రూ. 2.70 లక్షల రికార్డు ధరకు అమ్ముడు పోయినట్లు వెల్లడించారు. ఈ ప్లాట్ల విక్రయానికి ఆగస్టు 10న నోటిఫికేషన్ విడుదల చేయగా చదరపు గజానికి కనీస ధర రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో తీవ్ర పోటీ నెలకొనడంతో ఒక ప్లాట్ రూ.2.70 లక్షలు, మరొకటి రూ.2.36 లక్షలు, అలాగే మరో రెండు ప్లాట్లు రూ.2.06 లక్షల చొప్పున అమ్ముడయ్యాయి. మొత్తం 19 మంది బిడ్డర్లు పాల్గొన్న ఈ వేలం పాటలో సగటున చదరపు గజం ధర రూ.1.79 లక్షలు పలికింది. ఈ బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరిందని వైస్ ఛైర్మన్ వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *