– పలు కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో బుధవారం వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులతో ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కటికితాల శ్రీనివాస్, రహదారుల రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి వి.ఉమాశంకర్ లను సీఎస్ వేర్వేరుగా కలిశారు. కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి కటికితాల శ్రీనివాస్‌తో జరిగిన భేటీలో తెలంగాణలో పట్టణాభివృద్ధి, నివాస గృహాల నిర్మాణం, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.రహదారుల రవాణా శాఖ కార్యదర్శి వి. ఉమాశంకర్‌తో సమావేశమై రాష్ట్రంలో రహదారి అనుసంధానతను పెంచడం, జాతీయ రహదారుల విస్తరణ, రవాణా మౌలిక వసతుల అభివృద్ధిపై సమీక్షించారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఈ సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





