మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి చేయూత

– మంత్రి మహ్మద్ అజహరుద్దీన్

రంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 2 : మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తోందని మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్‌తో కలిసి లబ్ధిదారులకు ఆర్థిక సాయం, జీవనోపాధి ప్రోత్సాహకాలను ఆయన బుధవారం పంపిణీ చేశారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద 278 మంది మైనారిటీ విహిత మహిళలకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెక్కులను అందజేశారు. అలాగే తుర్క కాశా పునరావాస పథకం కింద 13 మంది కమ్యూనిటీ సభ్యులకు రూ.60 వేల విలువైన జనరేటర్, టూల్ కిట్లను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధికి నిలయమైన రంగారెడ్డి జిల్లాలోని అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనారిటీ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని, హజ్ ఏర్పాట్లకు రూ.7 కోట్లు మంజూరు చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. పాత బస్తీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి దిశగా సాగేలా నాయకులు మార్గదర్శనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దయానంద్, అదనపు కలెక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *