– కేంద్ర మంత్రి పెమ్మసానితో మంత్రి తుమ్మల భేటీ
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీలో కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి అదనంగా 2,000 ఇందిరమ్మ/పిఎంఎవై-జి ఇళ్లను మంజూరు చేసేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల పరిధిలోని ఏజెన్సీ, గిరిజన గ్రామ పంచాయతీల్లో డ్రైనేజీ మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ. 110 కోట్ల నిధులను మంజూరు చేయాలని మంత్రి తుమ్మల కేంద్ర సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





