ఉక్రెయిన్‌పై దాడిలో జగిత్యాల వాసి మృతి

జగిత్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : ఉక్రెయిన్‌పై రష్యా చేసిన భారీ దాడిలో జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్(42) మృతిచెందాడు. మంగళవారం ఉదయం తాను నివాసం ఉంటున్న గది నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈ దాడి జరగడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్వగ్రామంలో సెట్రింగ్ పని చేసిన సుదర్శన్‌గౌడ్ నాలుగు నెలల క్రితమే ఉపాధి నిమిత్తం ఉక్రెయిన్ వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున కీవ్ సహా పలు ప్రాంతాలపై క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, సుదర్శన్‌గౌడ్‌తోపాటు ఉక్రెయిన్‌లో ఉంటున్న తాటిపెల్లి గ్రామానికి చెందిన వేణు ద్వారా ఈ ఘటన గురించి మృతుడి కుటుంబ సభ్యులకు తెలిసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *