జల ద్రోహం చేస్తున్న జలగల పాలన

– భూములు నిషేధిత జాబితాలో పెట్టి 30శాతం కమీషన్లు
– వెయ్యి రోజుల్లో రూ.4.50 లక్షల కోట్ల అప్ప్పులు
– రుణ మాఫీ, పెన్షన్లు, ఉద్యోగాలు మోసపూరిత హామీలే
– కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ చార్జిషీట్
– సీఎం రేవంత్ పాలనపై నిప్ప్పులు చెరిగిన కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల దగా పాలనపై పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావుతో కలిసి తెలంగాణ భవన్‌లో బుధవారం చార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఎటు చూసినా విధ్వంసం, వికృతమే.. వెయ్యి రోజుల పాలన కాదు.. పీడన. జలద్రోహం చేస్తున్న జలగల పాలన అని మండిపడ్డారు. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో అని అన్నారు. పేదల భూములు నిషేధిత జాబితాలో పెట్టి 30శాతం కవిÖషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులు చేయకున్నా ఈ ప్రభుత్వం రూ.4.50లక్షల కోట్ల అప్ప్పులు చేసిందన్నారు.

కాంగ్రెస్ అసమర్థత ప్రొ మ్యాక్స్, అవినీతి అల్టామ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్ అంటూ విమర్శలు గుప్పించారు. రూ.50వేల కోట్లు రుణ మాఫీ చేస్తామని రూ.20వేల కోట్లు చేశారని, రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్ల మీద ఒట్టుపెట్టారని, మాఫీ చేయకుండా 70శాతం మందికి కుచ్చుటోపీ పెట్టారని విమర్శించారు. తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా కేసీఆర్ మారిస్తే కాంగ్రెస్ నాశనం చేసిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దరిద్రం దండయాత్ర మొదలుపెట్టి వెయ్యి రోజులు అయింది.. రాష్ట్ర సంపదను కొల్లగొట్టే విషయంలో సీఎం, మంత్రులు కొట్టుకుంటున్నారు.. కాంగ్రెస్ పాలనలో దిల్లీకి మూటలు, పదవుల కోసం కీచులాటలు తప్ప ఏం లేదు.. రైతుబంధు బంద్ అయ్యింది.. రాహుల్ బంధు మొదలైంది అని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాల వాటాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే మిమ్మల్ని వదిలిపెట్టం అని హెచ్చరించారు. మిస్ వరల్డ్ పోటీలు, మెస్సీ కోసం నిధులు భారీగా ఖర్చు చేస్తారు కానీ రైతులకు నీళ్లు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, జాబ్ క్యాలెండర్ పేరిట జాబ్‌లెస్ క్యాలెండర్ ఇచ్చారని అన్నారు. దిల్లీలో జెన్ జీని వెంటపెట్టుకుని ప్రజాస్వామ్యమని రాహుల్ కొటేషన్లు చెబుతుంటే ఇక్కడ మాత్రం నిరుద్యోగులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర సంపద కోసం మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకున్నారని, ప్రజా పాలన కాదు వెయ్యి రోజుల శని పాలన అని అన్నారు. వెయ్యి రోజులుగా ప్రజలకు నరకం చూపిస్తున్నారంటూ ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్ప చేసిందేవిÖ లేదన్నారు. చంద్రబాబుకు గురు దక్షిణగా కృష్ణా, గోదావరి నీళ్లు ఇస్తున్నాడన్నారు. అందాల పోటీలకు పెట్టిన ఖర్చులో పదో వంతు ఖర్చు చేస్తే కాఫర్ డ్యాం కట్టి నీళ్లు ఇయ్యొచ్చని ఇంజిర్లు చేబితే వారికి బెల్టు ట్రీట్‌మెంట్ ఉంటుందని భయపెట్టారని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ కుప్పకూల్చినా, చెక్ డ్యాంలు కూలినా బీజేపీ, ఎన్‌డీఎస్‌ఏ నోరు తెరవకపోవడాన్ని ఆక్షేపించారు. జీఆరఎంబీలో తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయాలని ఎజెండా పెడితే పారిపోతున్నారన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూములను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. యూరియా అడిగిన రైతులపై లాఠీచార్జి చేశారు.. కాళేశ్వరంపై కక్ష రైతన్నకు శిక్ష.. మోటర్లకు మీటర్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ కుప్ప కూలిందన్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పలువురు సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *