పాకిస్థాన్‌లో దారుణ ఘటన

– యూట్యూబర్‌ను కాల్చి చంపిన దుండుగులు

లాహోర్, ఆగస్ట్ 20 : పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాకర్, యూట్యూబర్ షమ్సో బీబీ దారుణ హత్యకు గురయ్యారు. 28 ఏళ్ల ఈ యువతికి టిక్‌టాక్‌లో 1.3 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈనెల 14న టాక్సిలా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షమ్సో తన సోదరుడు, సోదరితో కలిసి కారులో వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కాల్పులు జరిపారు. మృతురాలి తండ్రి ఫజల్ సాహిబ్‌జాదా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కాశిఫ్ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్ చేసి ఇంటినుంచి బయటకు రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన చెల్లి, తమ్ముడితో కలిసి కారులో బయటకు వచ్చారు. కాసేపటికే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి షమ్సో కారును అడ్డగించారు. ఆ వెంటనే తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో షమ్సో బీబీ మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. షమ్సో బీబీ సోదరి అసీమా కూడా తీవ్రంగా గాయపడింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. అయితే నిందితులకు షమ్సో బీబీకి సంబంధించిన సమాచారం అందించినట్లు అనుమానిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. హత్యపై రావల్పిండి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షమ్సో బీబీ హత్యకు ఆమె నిర్వహిస్తున్న సోషల్ విÖడియా కార్యకలాపాలు కారణం కాదని, ఆర్థిక వివాదమే కారణమై ఉండొచ్చని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కౌసర్, జావేద్ అలియాస్ షాహీన్‌తో షమ్సోకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తండ్రి పోలీసులకు తెలిపారు. 2026 మార్చిలో టిక్‌టాక్ క్రియేటర్ సనా జావేద్ అనే యువతి కూడా ఇస్లామాబాద్‌లో ఇదే తరహాలో హత్యకు గురయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *