– అమెరికా, ఇరాన్‌ల మధ్య పరస్పర దాడులు
టెహ్రాన్, సెప్టెంబర్ 2 : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అమెరికా దాడులతో తిరిగి అనిశ్చితి ఏర్పడింది. మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ విÖడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇరాక్, జోర్డాన్‌పై ఇరాన్ ప్రత్యేక సైనిక దళం ఐఆర్‌జీసీ దాడి చేసింది. కువైత్, బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించాయి. సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడి వల్ల ఓ పెళ్లింట విషాదం సంభవించిందని ఇరాన్ విÖడియా పేర్కొంది. ఓ చిన్నారి సహా నలుగురు మృతిచెందారని, 50 మంది గాయపడ్డారని తెలిపింది. ఈ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ మండిపడ్డారు. యÖఎస్‌కు తమ సైన్యం మర్చిపోలేని గుణపాఠం చెబుతుందని ఐఆర్‌జీసీ ప్రతినిధి హుస్సేన్ మొహబి పేర్కొన్నారు. అయితే, హోర్ముజ్‌లో కమర్షియల్ నౌకలపై ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే తాము దాడులు చేయాల్సి వచ్చిందని యÖఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకూ దాడులు కొనసాగాయంది. ఇక తమ భూభాగం వైపు వస్తున్న 13 బాలిస్టిక్ మిసైల్స్‌ను మార్గమధ్యంలోనే ధ్వంసం చేశామని జోర్డాన్ మిలిటరీ పేర్కొంది. మరో మÖడు మిసైల్స్ నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయాయని తెలిపింది. ఇరాన్ దాడుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పింది. బుధవారం ఉదయం ఇరాన్ ప్రయోగించిన పలు మిసైల్స్‌ను అడ్డుకున్నామని మరో ప్రకటనలో కువైట్ తెలిపింది. బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించినట్టు తెలిసింది. అమెరికా దాడుల్లో చిన్నారి మరణించినట్టు ఇరాన్ మీడియాలో వార్తలు రావడంపై యూఎస్ సెంట్‌కామ్ ప్రతినిధి స్పందించారు. ఇరాన్ దళాల మాదిరి తాము సామాన్య పౌరులను ఏనాcజూ టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



