రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు

– ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
– ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ అరెస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓఆరఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న నందులాలను ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని విద్యార్థి జైద్‌షా కద్రీ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండా మరో ప్రమాదం జరిగింది. ఆ విద్యార్థిని మరో కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో నందులాల అక్కడికక్కడే మృతిచెందగా విద్యార్థి జైద్‌షా కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు యాజమాని వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు విద్యార్థిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కారు యజమానిని గుర్తించారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ కారు నడిపి ఒకరి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు కారును సీజ్ చేసి సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *