– అరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
– అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలుహైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 27 నుంచి జులై 2వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వర్షంతోపాటు ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని తెలిపింది. గంటకు 40, 50 కిలోటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





