– కరస్పాండెంట్ కాయిత ఇంద్రసేనారెడ్డి
హుజూరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 :ఇటీవల ‘దోస్త్’ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు మూడు విడతలలో 2026 -2027 విద్యా సంవత్సరానికి గాను పూర్తయిన సందర్భంగా మాతృశ్రీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో అధిక సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్ పొందారని కళాశాల కరస్పాండెంట్ కాయిత ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు అధ్యాపక బృందానికి అభినందనలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ పట్టణంలో ఇతర డిగ్రీ కళాశాలలు విష ప్రచారాలు చేసినప్పటికీ విద్యార్థులు తమపై నమ్మకం ఉంచారని, కళాశాలలో రెగ్యులర్ క్లాసులతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలలో స్థిరపడునట్లు కృషి చేయడమే మాతృశ్రీ ధ్యేయమని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. విద్యార్థులు వివిధ కార్యక్రమాలలో సమర్థవంతంగా మాట్లాడడానికి పబ్లిక్ స్పీకింగ్ మెళకువలు, భవిష్యత్తులో ముందంజలో ఉండేందుకు స్టడీ స్కిల్స్, కెరీర్ గైడెన్స్ కోసం, ఒత్తిడిని దూరం చేసేందుకు ఏటా అనేక సరికొత్త కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ
నిరుద్యోగ యువతీయువకులకు తమ వద్ద డిగ్రీ చదువుకుంటుూ డిగ్రీతోపాటు ఉచిత కుట్టు మిషన్ నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. హన్మకొండలోని రోటరీ క్లబ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మూడు నెలలపాటు తమ కళాశాలలో కుట్టు మిషన్ నైపుణ్య శిక్షణ కొనసాగుతుందన్నారు. దీంతోపాటు ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, యంత్రాల నిర్వహణ తదితర అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్ఆ, పై చదివిన నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులని వెల్లడించారు. పూర్తి వివరాలకు మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి.రామారావు, ఏవో నరసింహారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





