దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హీట్‌వేవ్

– పెరిగిన ఎండల తీవ్రత
– ఇప్పటికే వడదెబ్బకు ముగ్గురు మృతి
– భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు రావడం కష్టంగా మారింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రత కారణంగా విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. వడదెబ్బతో రాష్ట్రంలో ముగ్గురు మృతిచెందగా, పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశవ్యాప్తంగా హీట్‌వేవ్ కొనసాగుతున్నది. ఎండలు దంచికొడుతున్నాయి. చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి,. కొన్నిచోట్ల వరుసగా  కొన్ని రోజులుగా ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటుతోంది. అయితే అదే స్థాయిలో విద్యుత్తు వినియోగం కూడా పెరిగింది. సోమవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా గరిష్టంగా 255.85 గిగావాట్ల విద్యుత్తును వినియోగించినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఎయిర్ కండిషనర్లు, డిజర్ట్ కూలర్లు అధికంగా వాడడం వల్ల విద్యుత్తు వినియోగం కూడా పీక్ స్టేజికి చేరుకున్నది. ఈనెలలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఈ నెల రెండో అర్థభాగం నుంచి విద్యుత్తు మోత మోగుతున్నది. శుక్రవారం 252.07 గిగావాట్లు, శనివారం 25వ తేదీన 256.11 గిగావాట్ల వినియోగం జరిగినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. అయితే గత ఆదివారం విద్యుత్తు వినియోగం తగ్గింది. ఆరోజు 238.15 గిగావాట్ల విద్యుత్తును వినియోగించారు. కమర్షియల్, ఇండస్ట్రియల్ కంపెనీలు ఎక్కువగా సెలవు తీసుకోవడం వల్ల ఆదివారం విద్యుత్తు వినియోగం తగ్గినట్లు అంచనా. దీంతోపాటు కొన్నిచోట్ల డస్ట్ స్టార్మ్, వర్షాలు పడడం వల్ల ఆదివారం వినియోగం తగ్గింది. గత ఏడాది అత్యధికంగా విద్యుత్తు వినియోగం జూన్‌లో రికార్డు అయ్యింది. 2025 జూన్‌లో ఓ రోజు గరిష్టంగా సుమారు 242.77 గిగావాట్ల విద్యుత్తును వినియోగించారు. 2024లో గరిష్టంగా 250గిగావాట్ల విద్యుత్తును మే నెలలో వాడారు. ఇక 2023లో సెప్టెంబర్‌లో సుమారు 243.27 గిగావాట్ల విద్యుత్తును వినియోగించారు. ఈ ఏడాది వేసవిలో ఎండలు మండనున్నట్లు ఐఎండీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది గరిష్ఠంగా 270 గిగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ నిపుణులు చెబుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *